హోం మంత్రిత్వ శాఖ
రోజీ సంగ్మా, శామ్యూల్ సంగ్మా మరణాలపై దర్యాప్తు జరుపవలసిందిగా సిబిఐని కోరిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
13 JUL 2021 8:30PM by PIB Hyderabad
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన రోజీ సంగ్మా, శామ్యూల్ సంగ్మా మరణాల కేసులో దర్యాప్తు నిర్వహించవలసిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను (సిబిఐ)ని కోరింది.
ఈ ఏడాది జూన్ 24వ తేదీన అనారోగ్యంతో గుర్‌గాంవ్ లోని ఒక ఆసుపత్రిలో చేరిన రోజీ సంగ్మా మరణానికి సంబంధించిన కేసు ఇది. అనంతరం, రోజీ సంగ్మాకు బంధువైన శామ్యూల్ సంగ్మా వైద్యం అందించడంలో అవతవకలు జరుగుంటాయనే అనుమానంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో గొడవకు దిగారు. మర్నాడు, అంటే జూన్ 25వ తేదీన శామ్యూల్ సంగ్మా మరణించారన్న సమాచారం ఢిల్లీ పోలీసులకు అందింది.
మృతుల కుటుంబ సభ్యలు రోజీ సంగ్మా ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా మరణించిందని ఆరోపించారు. అలాగే, శామ్యూల్ సంగ్మా మరణానికి కూడా ఆసుపత్రి సిబ్బంది కపటత్వం కారణమని వారు ఆరోపించారు.
****
(रिलीज़ आईडी: 1735734)
आगंतुक पटल : 197