ప్రధాన మంత్రి కార్యాలయం

జులై 15న వారాణసీ ని సందర్శించనున్న ప్ర‌ధాన మంత్రి

1500 కోట్ల రూపాయల కు పైగా విలువైన పథకాల కు ప్రారంభం మరియు శంకుస్థాపన చేయనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 13 JUL 2021 6:11PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి 2021 జులై 15న వారాణసీ ని సందర్శించనున్నారు.  ఆయన తన యాత్ర లో భాగం గా అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించడమే కాక కొన్ని పథకాల కు శంకుస్థాపన లు చేయనున్నారు.

ఉదయం 11 గంటల వేళ లో, ప్రధాన మంత్రి వివిధ సార్వజనిక పథకాల కు, పనుల కు ప్రారంభం చేయనున్నారు. వాటి లో బిహెచ్ యు లోని ఎమ్ సిహెచ్  లో ఓ 100 పడకల తో కూడిన విభాగం, గొదౌలియా లో బహుళ స్థాయి ల పార్కింగ్, గంగా నది లో పర్యటన అభివృద్ధి కి ఉద్దేశించినటువంటి రొ-రొ వెసల్స్, వారాణసీ ఘాజీపుర్ హైవే లో మూడు దోవ ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వంటివి కూడా భాగం గా ఉన్నాయి. 744 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు లు ప్రారంభం కానున్నాయి.  దాదాపు గా 839 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టుల కు, సార్వజనిక పనుల కు ఆయన శంకుస్థాపనలు కూడా చేస్తారు.  వాటి లో సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీయరింగ్ ఎండ్ టెక్నాలజీ (సిఐపిఇటి) కి చెందిన సెంటర్ ఫార్ స్కిల్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్, జల్ జీవన్ మిశన్ లో భాగం గా చేపట్టే 143 గ్రామీణ పథకాలు, కర్ఖియాన్వి లో మామిడి, కాయగూరల సమీకృత‌ ప్యాక్ హౌస్ లు కూడా ఉన్నాయి.

మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల కు ప్రధాన మంత్రి ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటర్ ‘రుద్రాక్ష్’ ను ప్రారంభించనున్నారు. దీనిని జపాన్ సాయం తో నిర్మించడం జరిగింది.  అటు తరువాత,  మధ్యాహ్నం సుమారు 2 గంటల కు ఆయన బిహెచ్ యు లో మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేస్తారు.  కోవిడ్ సంబంధి సన్నద్ధత ను సమీక్షించడం కోసం అధికారుల తోను, వైద్య రంగ నిపుణుల తోను ఆయన సమావేశం కానున్నారు.


 

***


(Release ID: 1735149) Visitor Counter : 196