నౌకారవాణా మంత్రిత్వ శాఖ
మంత్రిత్వ శాఖలో కొనసాగుతున్న ప్రాజెక్టులను సమీక్షించిన ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
प्रविष्टि तिथि:
11 JUL 2021 1:48PM by PIB Hyderabad
ఓడరవాణా, రేవులు, జలమార్గ (పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్) మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆదివారం సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల స్థితిని గురించి ఎంఒపిఎస్‌డబ్ల్యు శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్ మంత్రికి వివరించారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులందరితో మంత్రి తన ఛాంబర్‌లో సంభాషించారు.
తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు అన్నిరకాలుగా కృషి చేస్తానని సర్బానంద్ తెలిపారు. తనకు ముందు మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రారంభించిన మంచిపనులన్నింటినీ ముందుకు తీసుకువెడతానని, ఎటువంటి జాప్యాలు లేకుండా లక్ష్యంగా పెట్టుకున్న మైలురాళ్ళను సాధించేందుకు తన కొత్త టీంతో కలిసి తీవ్రంగా కృషి చేస్తానని వివరించారు.
ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఉన్న ఎంఒపిఎస్‌డబ్ల్యు కార్యాలయానికి వచ్చిన మంత్రికి, ఎంఒపిఎస్‌డబ్ల్యు కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్, ఎంఒపిఎస్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి సంజయ్ బందోపాధ్యాయ, సంయుక్త కార్యదర్శి (ఓడరేవులు) విక్రమ్ సింగ్, సంయుక్త కార్యదర్శి (పరిపాలన) లూకాస్ ఎల్ కామ్సువాన్ స్వాగతం పలికారు.
***
(रिलीज़ आईडी: 1734634)
आगंतुक पटल : 213