ఆర్థిక మంత్రిత్వ శాఖ

91 కోట్ల రూపాయల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసిన 23 కంపెనీల నెట్ వర్క్ ని బట్టబయిలు చేసిన సిజిఎస్‌టి అధికారులు

Posted On: 11 JUL 2021 10:27AM by PIB Hyderabad

ఇంటలిజెన్స్ ద్వారా అందిన సమాచారంతో ఢిల్లీ (పశ్చిమ) కేంద్ర వస్తు, సేవల పన్ను కమిషనరేట్ కి చెందిన యాంటీ-ఇవేజన్ విభాగం (ఎగవేత దారులను పట్టుకునే విభాగం) అధికారులు సరుకు లేకుండానే రూ.91 కోట్ల ఇన్వాయిస్లను సృష్టించడం ద్వారా లభ్యత / వినియోగం అనుమతిలేని ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) ను పొందిన బండారాన్ని బట్టబయలు చేశారు. అనుమతిలేని క్రెడిట్ ను పొందేలా బహుళ సంస్థలను సృష్టించడమే దీనివెనుక ఉన్న గూడుపుఠాణి. 

ఈ నెట్ వర్క్ లో మెస్సర్స్ గిరిధర్ ఎంటర్ప్రయిసెస్, మెస్సర్స్ అరుణ్ సేల్స్, మెస్సర్స్ అక్షయ్ ట్రేడర్స్, మెస్సర్స్ శ్రీ పద్మావతి ఎంటర్ప్రయిసెస్ తో పటు మరో 19 సంస్థల పేర్లున్నాయి. వస్తు రహిత ఇన్వాయిస్ లను ఈ 23 సంస్థల పేర్లపై సృష్టించి, తప్పుడు ఐటీసీ పొంది, ప్రభుత్వానికి వాస్తవంగా చెల్లించాల్సిన జిఎస్‌టి చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అధికారులు కనుగొన్నారు. దివంగత దినేష్ గుప్త, శుభమ్ గుప్తా, వినోద్ జైన్, యోగేష్ గోయెల్ ఈ మోసపూరిత ఇన్వాయిస్ లను సృష్టించడంలో ప్రధాన పాత్రధారులుగా గుర్తించారు. ఈ సంస్థలు రూ.551 కోట్ల విలువ చేసే వస్తు-రహిత ఇన్వాయిస్ లను సృష్టించి రూ.91 కోట్ల అనుమతి లేని ఐటీసీని క్లెయిమ్ చేశారు. మొత్తం ముగ్గురు నిందితులూ తమ నేరాన్ని అంగీకరిస్తూ స్వచ్ఛంద స్టేట్మెంట్ ఇచ్చారు.

అందువల్ల, సిజిఎస్టి చట్టం, 2017 లోని సెక్షన్ 132 (1) (బి) మరియు 132 (1) (సి) ప్రకారం శుభమ్ గుప్తా, వినోద్ జైన్, యోగేష్ గోయెల్ గుర్తించదగ్గ నేరాలు, సెక్షన్ 132 (5) ప్రకారం నాన్ బెయిలబుల్  నేరాలకు పాల్పడ్డారు.  సెక్షన్ 132 లోని సబ్ సెక్షన్ (1) లోని క్లాజ్ (ఐ) కింద వీరు శిక్షార్హులు. దీని ప్రకారం, వారిని 2021 జులై 10వ తేదీన సిజిఎస్‌టి  చట్టం సెక్షన్ 132 కింద అరెస్టు చేశారు. డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేస్తూ ఆదేశాలు జరీ చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

జిఎస్‌టి ఎగవేతపై ఢిల్లీ జోన్ అధికారులు నిరంతర దృష్టి సారించారు. దీనిలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 91.256 కోట్లు ఎగవేత మొత్తాన్ని గుర్తించారు. ముగ్గురిని  అరెస్టు చేశారు.

 

****



(Release ID: 1734628) Visitor Counter : 227