వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రాచుర్యం పొందుతున్న జిఐఎస్ ఆధారిత ల్యాండ్ బ్యాంక్
వెబ్‌సైట్ లో ఏప్రిల్ 2021 నుంచి 30% పెరిగిన పేజ్ వ్యూలు
Posted On:
09 JUL 2021 2:18PM by PIB Hyderabad
అన్ని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంబంధిత సమాచారం - అనుసంధానత, ఇన్ఫ్రా, సహజ వనరులు & భూభాగం, ఖాళీ ప్లాట్లపై ప్లాట్-స్థాయి సమాచారం, కార్యాచరణ, సంప్రదింపు వివరాలు పొందేందుకు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (IILB) జిఐఎస్- ఆధారిత పోర్టల్ ఏకగవాక్షం వంటిది. ప్రస్తుతం దాదాపు 5.5 లక్షల హెక్టార్ల భూమి వ్యాప్తంగా 4000 పారిశ్రామిక పార్కులకు సంబంధించిన వివరాలు నక్షాను ఐఐఎల్‌బి కలిగి ఉంది. ఇది మారుమూలల భూమి కోసం వెతుకుతున్న పెట్టుబడుదారులు దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఒక మద్దతు వ్యవస్థగా ఉంటుంది. ఈ వ్యవస్థను 17 రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ఆధారిత జిఐఎస్ వ్యవస్థతో సమగ్రం చేశారు. ఈ పోర్టల్‌పై వివరాలను ఎప్పటికప్పుడు తాజా పరిచేందుకు, డిసెంబర్ 2021నాటికి భారతదేశ వ్యాప్తంగా సమగ్రం చేయాలన్న లక్ష్యాన్ని కలిగి ఉంది.
లాగిన్ అవసరం లేని మొబైల్ అప్లికేషన్ ను ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్టోర్స్‌లో ప్రారంభించారు. త్వరలోనే అదనపు ఫీచర్లను జోడించనున్నారు. సమాంతరంగా, ఉపయోగించేవారికి అనుకూలంగా ఈ పోర్టల్ ను రూపొందించారు. అంటే, యూజర్లు లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. పోర్టల్ నమూనా, యుఐ అన్నవి మేలైన యూజర్ అనుభవం కోసం నిరంతరం మెరుగుపరుస్తున్నారు.
అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ హోంపేజీ ద్వారా కూడా లాండ్ బ్యాంక్ గురించిన సమాచారాన్ని పొందవచ్చు. ఒక్కసారి మనం పారిశ్రామిక సమాచార వ్యవస్థ అన్నదానిపై క్లిక్ చేస్తే, ఆ పేజీని https://iis.ncog.gov.in/parks/login1కు పెట్టుబడిదారులకు వివరాలు అందుబాటులోకి వచ్చే విధంగా రీడైరెక్ట్ చేస్తుంది. అదనంగా, ఇన్వెస్ట్ ఇండియా వెబ్‌సైట్ లో ఇండియా ఇండస్ట్రియల్ లాండ్ బ్యాంక్ అన్న రీసోర్స్ కింద సమాచారాన్ని పొందవచ్చు.
ఏప్రిల్ 2021 నుంచి ప్రతి నెల వెబసైట్ లో పేజ్ వ్యూలు 30% పెరిగి, జూన్ నెలలో 55000 పేజ్ వ్యూస్ అయ్యాయి. మే, 2021లో ఇవి 44316గా ఉండగా, ఏప్రిల్ 2021లో 30153 పేజ్ వ్యూలుగా ఇవి ఉన్నాయి. గత త్రైపక్షంలో (ఏప్రిల్ -జూన్ 2021)లో మొత్తం యూజర్లు 13,610 కాగా, ఇందులో 12,996మంది విశిష్టమైన యూజర్లు. ఈ కాలంలో మొత్తం పేజ్ వ్యూలు దాదాపు 1.3 లక్షలుగా ఉంది.
దేశాల వారీగా వెబ్ సైట్ ను చూసిన వారిని పరిశీలిస్తే, భారత్ తర్వాత యునైటెడ్ స్టేట్స్‌నుంచి అత్యధికమంది ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డం, సింగపూర్, యుఎఇ, జర్మనీ, ఇండొనేషియాలు ఉన్నాయి. వివిధ పారిశ్రామిక సంఘాలు, సింగపూర్ ఇండియన్ హైకమిషన్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ కొరియా, కెఒటిఆర్ ఎ (KOTRA ), మలేషియా, కొరియా పెట్టుబడుదారులకు సంబంధించిన అనేక కార్యక్రమాలలో ఐఎల్ఎల్‌బి పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించిన ప్రదర్శనను నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1734342)
Visitor Counter : 257