ఆర్థిక మంత్రిత్వ శాఖ

17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు విడుదల


ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.39,484 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు రాష్ట్రాలకు విడుదల

Posted On: 08 JUL 2021 11:17AM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం, పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ ( పిడిఆర్‌డి) గ్రాంట్‌  4 వ నెలవారీ వాయిదా కింద రూ. 9,871.00 కోట్లును  నిన్న రాష్ట్రాలకు  విడుదల చేసింది. ఈ వాయిదా విడుదలతో, మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రూ.39,484.00 కోట్లు పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌గా అర్హత ఉన్న రాష్ట్రాలకు విడుదల చేశారు.
 

ఈ నెలలో విడుదల చేసిన గ్రాంట్ రాష్ట్రాల వారీ వివరాలు, 2021-22లో రాష్ట్రాలకు విడుదల చేసిన  పిడిఆర్‌డి  గ్రాంట్ మొత్తం ఇక్కడ జతచేయడం జరిగింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇస్తారు. పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం నెలవారీ వాయిదాలలో రాష్ట్రాల రెవెన్యూ అకౌంట్లలోని లోటును భర్తీ చేయడానికి ఈ గ్రాంట్లు విడుదల అవుతాయి. 2021-22 మధ్య కాలంలో 17 రాష్ట్రాలకు పిడిఆర్‌డి గ్రాంట్లను కమిషన్ సిఫారసు చేసింది.
 

ఈ మంజూరును స్వీకరించడానికి రాష్ట్రాల అర్హత, గ్రాంట్ పరిమాణం 2021-22 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన నిధుల ప్రాప్తిని పరిగణనలోకి తీసుకున్న తరువాత రాష్ట్ర ఆదాయ, వ్యయాల అంచనా మధ్య అంతరం ఆధారంగా కమిషన్ నిర్ణయించింది.

పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ మొత్తం పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌  రూ.1,18,452 కోట్లును 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. ఇందులో 4 వాయిదాలలో ఇప్పటివరకు   రూ.39,484 కోట్లు (33.33%) విడుదలయ్యాయి.
 

పిడిఆర్‌డి గ్రాంట్ కోసం పదిహేనవ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపురా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ .

 

రాష్ట్రాల వారీ విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌లు 

 

వరుస సంఖ్య

రాష్ట్రం పేరు 

2021 జులై లో విడుదలైన నిధులు (4వ వాయిదా) 

(రూ.కోట్లలో )

2021-22లో విడుదలైన మొత్తం నిధులు 

(రూ.కోట్లలో)

 1. 

ఆంధ్రప్రదేశ్ 

1438.08

5752.33

 2. 

అస్సోమ్ 

531.33

2125.33

 3. 

హర్యానా 

11.00

44.00

 4. 

హిమాచల్ ప్రదేశ్ 

854.08

3416.33

 5.

కర్ణాటక 

135.92

543.67

 6.

కేరళ 

1657.58

6630.33

 7. 

మణిపూర్ 

210.33

841.33

 8. 

మేఘాలయ 

106.58

426.33

 9. 

మిజోరాం 

149.17

596.67

 10. 

నాగాలాండ్ 

379.75

1519.00

 11. 

పంజాబ్ 

840.08

3360.33

 12. 

రాజస్థాన్ 

823.17

3292.67

 13. 

సిక్కిం 

56.50

226.00

 14. 

తమిళనాడు 

183.67

734.67

 15. 

త్రిపురా 

378.83

1515.33

 16. 

ఉత్తరాఖండ్ 

647.67

2590.67

 17. 

పశ్చిమ బెంగాల్ 

1467.25

5869.00

 

మొత్తం 

9,871.00

39484.00

 

 

 

****


(Release ID: 1734091) Visitor Counter : 169