శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో విస్తరిస్తున్న సౌర రంగానికి మరింత చేయూత - హైదరాబాద్ లో కొత్త సౌర ఉష్ణ భాగాల పరీక్షా సౌకర్యం

Posted On: 07 JUL 2021 6:47PM by PIB Hyderabad

సోలార్ రిసీవర్ ట్యూబులు,  హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్,   కాన్సన్ట్రేటింగ్ మిర్రర్లు వంటి సోలార్ థర్మల్ భాగాల సామర్థ్యం మరియు పనితీరును పరీక్షించడం కోసం, హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కాన్సంట్రేటెడ్ సోలార్ థర్మల్ (సి.ఎస్‌.టి) ఆధారిత టెస్ట్ రిగ్ సౌకర్యం, భారతదేశంలో విస్తరిస్తున్న సౌర పరిశ్రమకు సహాయపడనుంది.

శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) కి చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ, ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏ.ఆర్.సి.ఐ) ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం, సి.ఎస్.టి. వ్యవస్థ కు చెందిన సోలార్ రిసీవర్ ట్యూబులు, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్,  కాన్సన్ట్రేటింగ్ మిర్రర్లు, ఏ.ఆర్. పూత గల గాజు గొట్టాలు వంటి సౌర ఉష్ణ భాగాలను, క్షేత్ర స్థాయిలో ధృవీకరిస్తుంది.

ఆపరేటింగ్ పారామితులతో (ఉదా., హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్ (హెచ్.టి.ఎఫ్. లు) ఆపరేటింగ్ ఉష్ణోగ్రత, పీడనాలు మొదలైనవి) మరియు విభిన్న డి.ఎం.ఐ. (డైరెక్ట్ నార్మల్ ఇరాడియన్స్) పరిస్థితులతో కూడిన విభిన్నమైన ప్రామాణిక భాగాల పనితీరును (ఉష్ణ లాభం మరియు ఉష్ణ నష్టం లక్షణాలు) సమాంతరంగా పోల్చడం ద్వారా ఇది దేశీయ భాగాలను ధృవీకరిస్తుంది.

తక్కువ మరియు మధ్య-ఉష్ణోగ్రత అనువర్తనాల కోసం సౌర ఉష్ణ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి స్వదేశీ సౌర ఉష్ణ భాగాల తయారీ సౌకర్యాలు మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇంజనీరింగ్ నమూనాలపై ఎక్కువ శ్రద్ధ అవసరం.  ఎందుకంటే, చాలా వరకు సోలార్ థర్మల్ కంపెనీలు,  సోలార్ థర్మల్ విడిభాగాలను, ముఖ్యంగా చైనా మరియు యూరప్ నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. 

ఈ విషయంలో, తక్కువ ఖర్చుతో కూడుకున్న సోలార్ రిసీవర్ ట్యూబులు, యాంటీ రిఫ్లెక్టివ్ (ఏ.ఆర్) కోటెడ్ గ్లాస్ కవర్లు, నానో-స్ట్రక్చర్డ్ మెటీరియల్-బేస్డ్ థర్మిక్ ఫ్లూయిడ్ లు మరియు మన్నికైన రిఫ్లెక్టివ్ మిర్రర్ల పనితీరును మెరుగుపరచడానికి, భారతదేశంలో సౌర ఉష్ణ వ్యవస్థల ఖర్చును తగ్గించడానికి, ఏ.ఆర్.సి.ఐ. కృషి చేస్తోంది. 

అభివృద్ధితో పాటు, సౌర ఉష్ణ సాంకేతిక పరిజ్ఞానం విస్తరణకు వాస్తవ-క్షేత్ర పరిస్థితుల్లో విడిభాగాల పరీక్ష మరియు ధృవీకరణ చాలా కీలకం.   ఈ అవసరాన్ని తీర్చడానికి, భారత ప్రభుత్వ డి.ఎస్.టి. కి చెందిన సాంకేతిక పరిశోధనా కేంద్రం (టి.ఆర్.సి) ప్రాజెక్ట్, మద్దతు తో సాంద్రీకృత సౌర ఉష్ణ-ఆధారిత సింగిల్-యాక్సిస్ పారాబొలిక్ ట్రఫ్ టెస్ట్ రిగ్ సదుపాయాన్ని, ఏ.ఆర్.సి.ఐ. ఏర్పాటు చేసింది.

పారాబొలిక్-ట్రఫ్ టెస్ట్ రిగ్ సదుపాయంలో ప్రామాణిక మరియు స్వదేశీ సోలార్ రిసీవర్ ట్యూబులను ఒకే సమయంలో పరీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి.  ఇది థర్మిక్ ఫ్లూయిడ్-ఆధారిత క్లోజ్డ్-లూప్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది 50 నుంచి 350 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పరిధి లో పనిచేయగలదు. ఇది సౌర వికిరణ స్థితికి చెందిన వాస్తవ కొలతతో వాస్తవ-క్షేత్ర పరిస్థితులలో ఉష్ణ లాభ అధ్యయనాలను నిర్వహించగలదు.   వేర్వేరు ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలలో సౌర రిసీవర్ల యొక్క వాస్తవ ఉష్ణ నష్టాన్ని కొలవడానికి ఎలక్ట్రికల్ హీటర్ మద్దతును కలిగి ఉంటుంది.

ఏ.ఆర్.సి.ఐ. కి చెందిన టెస్ట్ రిగ్ సౌకర్యం, వాస్తవ క్షేత్ర స్థాయి పరిస్థితులలో దేశీయంగా అభివృద్ధి చెందిన సౌర ఉష్ణ భాగాల పనితీరును అందిస్తుంది, తద్వారా పరిశ్రమల నుండి ఎక్కువ ప్రయోజనాన్ని ఆకర్షిస్తుంది.  ఇటీవల, బెంగళూరు లోని హెచ్‌.పి.సి.ఎల్. కి చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం, ప్రపంచ-ప్రముఖ వాణిజ్య ఉత్పత్తి పోలికతో దేశీయంగా అభివృద్ధి చెందిన ఉష్ణ బదిలీ ద్రవాలను ధృవీకరించడం కోసం ఏ.ఆర్.సి.ఐ. కి ఒక ప్రాజెక్టును మంజూరు చేసింది.

మరింత సమాచారం కోసం సంప్రదించండి:

 

Description: C:\Users\srinivasarao\Desktop\PHOTOS\ARCI_CALENDAR_2020\DSC03641.JPG

డాక్టర్ ఎస్.శక్తివేల్, హెడ్, సెంటర్ ఫర్ సోలార్ ఎనర్జీ మెటీరియల్స్, ఏ.ఆర్.సి.ఐ. 

వెబ్-సైట్ : ssakthivel@arci.res.in.



(Release ID: 1733598) Visitor Counter : 216