రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నాలుగు దేశాల రాయబారుల నియామక పత్రాల సమర్పణ


వర్చువల్ పద్ధతిలో రాష్ట్రపతి ఆమోదం

Posted On: 07 JUL 2021 2:21PM by PIB Hyderabad

నాలుగు దేశాలకు చెందిన రాయబారులు సమర్పించిన అధికారిక నియామక పత్రాలను రాష్ట్రపతి రామ్.నాథ్ కోవింద్ ఈ రోజు ఆమోదించారు. థాయిలాండ్, రుమేనియా, కజఖిస్తాన్ రిపబ్లిక్, టర్కీ రిపబ్లిక్ దేశాల రాయబారుల నియామక పత్రాలను వర్చువల్ పద్ధతిలో రాష్ట్రపతి ఆమోదించారు. ఈ రోజు నియామక పత్రాలు సమర్పించిన రాయబారులు:


1.  పత్తారత్ హాంగ్తాంగ్, థాయిలాండ్ కింగ్.డమ్ రాయబారి
2.  డేనియల్ మారియానా సెజొనొవ్ తానే, రుమేనియా రాయబారి
3.  నుర్లాన్ ఝల్గాస్.బయెవ్, కజఖిస్తాన్ రిపబ్లిక్ రాయబారి
4.  ఫిరాట్ సునెల్,  టర్కీ రిపబ్లిక్ రాయబారి

  
  నియామక పత్రాలు సమర్పించిన రాయబారులందరికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. థాయిలాండ్, రుమేనియా, కజఖిస్తాన్, టర్కీ దేశాలతో భారతదేశానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. శాంతి, సౌభాగ్యాలనే ఉమ్మడి లక్ష్యాలతో ఆ దేశాలకు, భారత్ కు మధ్య  సంబంధాలు దృఢంగా వేళ్లూనుకుపోయాయని ఆయన అన్నారు. 
   కోవిడ్-19 వైరస్ మహమ్మారిపై నిర్ణయాత్మకంగా ప్రతిస్పందన,  ప్రపంచ స్థాయి కృషి, పోరాటంలో భారతదేశం ముందంజలో ఉంటూ వచ్చిందన్నారు. ఆరోగ్యం, ఆర్థిక సంక్షేమం లక్ష్యంగా భారత్ ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కోవిడ్ వైరస్ కట్టడికోసం జరిగిన ప్రపంచ స్థాయి పోరులో భాగంగా అత్యవసర మందులను సరఫరా చేయడంలో భారతదేశం ఎంతో క్రియాశీలంగా అనేక దేశాలకు తగిన సహాయాన్ని అందించిందని, ‘ప్రపంచ ఔషధాగారం’గా భారతదేశం తన పాత్రను నిర్వర్తించిందని రాష్ట్రపతి అన్నారు.


 

ఈ సందర్భంగా, థాయిలాండ్, రుమేనియా, కజఖిస్తాన్, టర్కీ దేశాల అధినేతల తరఫున ఆయా దేశాల రాయబారులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని వారు పునరుద్ఘాటించారు. 
 


(Release ID: 1733370)