రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి అభివృద్ధి యొక్క అన్ని దశలలో భద్రతా ఆడిట్ తప్పనిసరి చేశాముః ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
05 JUL 2021 3:48PM by PIB Hyderabad
ప్రమాదాలను తగ్గించడానికి రహదారి అభివృద్ధి యొక్క అన్ని దశలలో భద్రతా ఆడిట్ తప్పనిసరి చేయడమైందని ఉపరితల రవాణా, రహదారులు మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల ప్రమాదాల నివారణ భద్రతపై వర్చువల్ విధానంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక సింపోజియంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఎక్కువ రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది వాహనాల ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని వివరించారు. ఇది కోవిడ్-19 మరణాల కంటే కూడా ఎక్కువ అని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణాలను సగానికి (50%) తగ్గించడంతో పాటుగా, 2030 నాటికి సున్నా ప్రమాదాలు మరియు మరణాలను సాధించడంపై తాము దృష్టి సారించామని మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల మరణాలలో 60 శాతం మరణాలు ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయని మంత్రి శ్రీ గడ్కరీ వివరించారు. మోటారుసైకిల్ ట్రాఫిక్ యొక్క రక్షణ, భద్రత తక్షణావసరం అని ఆయన అన్నారు. గ్లోబల్ దృష్టాంతంలో వెహికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చాలా వరకు పరిణతి చెందిందని, అన్ని రోడ్ ఇంజినీరింగ్ చర్యలు ప్రమాదవశాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జు కావడాన్ని గరిష్టంగా తగ్గించి నష్ట నివారణను మెరుగు పరుస్తున్నాయని ఆయన అన్నారు. వాహన డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం, అధునాతన శిక్షణా సంస్థలు, కేంద్రాల స్థాపన యొక్క ప్రాముఖ్యతను మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. మంచి రోడ్లు తయారు చేయడం, రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తన నైతిక బాధ్యత అని శ్రీ గడ్కరీ అన్నారు. తమ లక్ష్యాల్ని సాధించేందుకు, అవగాహన కల్పించడానికి వాటాదారుల యొక్క సహకారం, కమ్యూనికేషన్, సమన్వయం చాలా అవసరం అని మంత్రి శ్రీ గడ్కరీ అన్నారు.
మొత్తం ఈవెంట్ లింక్ https://youtu.be/OEkRhMItvsM
(Release ID: 1732939)
Visitor Counter : 698