ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 అప్‌డేట్
Posted On:
04 JUL 2021 9:15AM by PIB Hyderabad
ఇప్పటివరకు దేశ వ్యాప్త వాక్సినేన్‌లో భాగంగా 35.12 కోట్ల మందికి వాక్సిన్ వేయడం జరిగింది.
ఇండియాలో గత 24 గంటలలో 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీల కేసుల లోడ్ 4,85,350 కి పడిపోయింది.
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.59 శాతంగా ఉన్నాయి.
దేశంలో ఇప్పటివరకు 2,96,58,078 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గొంటలలో 52,299 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారీ గా కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య , వరుసగా 52 వ రోజు కోవిడ్ పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి రేటు 97.09 శాతంగా ఉంది.
వారపు పాజిటివిటిరేటు 5 శాతం కంటే దిగువన ఉంది. ప్రస్తుతం ఇది 2.44 శాతం.
రోజువారి పాజి టివిటిరేటు వరుసగా 27 రోజులుగా 5 శాతం కంటే దిగువన ఉంది. ప్రస్తుతం ఇది 2.34 శాతం.
దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 41.82 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
(Release ID: 1732616)
Visitor Counter : 166