శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ ( ఐఎస్ఈఎఫ్ ) లో 9 గ్రాండ్ అవార్డులు మరియు 8 ప్రత్యేక అవార్డులను గెలుచుకున్న టీమ్ ఇండియా 2021
Posted On:
03 JUL 2021 4:20PM by PIB Hyderabad
రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ ( ఐఎస్ఈఎఫ్ ) లో టీమ్ ఇండియా 2021 9 గ్రాండ్ అవార్డులు మరియు 8 ప్రత్యేక అవార్డులను గెలుచుకుంది. శాస్త్ర సాంకేతికరంగాల్లో చేసిన వినూత్న ఆవిష్కరణలకు గుర్తింపుగా టీమ్ ఇండియా 2021కు ఈ అవార్డులు లభించాయి. జీవరాశులపై జీవం లేని వస్తువుల వల్ల కలిగే ఒత్తిడి, వైద్యులు కానివారు కూడా ఉపయోగించి ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవడానికి దోహదపడే రియాలిటీ స్మార్ట్ స్టెతస్కోప్ రూపకల్పన లాంటి ఆవిష్కరణలతో గెల్చుకున్న భారత బృందం లోని యువ విద్యార్థులు దేశానికి గుర్తింపు తీసుకుని వచ్చారు.
రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ ( ఐఎస్ఈఎఫ్ ) లో పాల్గొన్న భారత బృంద స భ్యులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అభినందించారు. వర్చువల్ విధానంలో రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో బహుమతులను గెల్చుకున్న 26 మంది సభ్యులతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో 64 దేశాలు, ప్రాంతాలకు చెందిన 1833 మందితో భారత బృందం పోటీ పడింది. ఈ పోటీలో దేశానికి 17 అవార్డులు లభించాయి.
సృజనాత్మకతతో జ్ఞానం మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.సృజనాత్మకంగా ఆలోచించి నూతన వినూత్న ఆవిష్కరణల సాధనకు కృషి చేస్తే విజయం వరిస్తుందని ఆయన అన్నారు. విజేతలను అభినందించిన అశుతోష్ శర్మ వారు సాగించిన పరిశోధనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బృంద సభ్యులు రూపొందించిన పరికరాల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఎన్‌సిఎస్‌టిసి హెడ్ డాక్టర్ ప్రవీణ్ అరోరా, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైంటిస్ట్ ఎఫ్ సుజిత్ బెనర్జీ పాల్గొన్నారు.
ఐరిస్ ఫెయిర్ డైరెక్టర్ మరియు ఎక్స్‌స్టెంప్లర్ ఎడ్యుకేషన్ లింకర్స్ ఫౌండేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రీమతి షరోన్ ఇ. కుమార్ మాట్లాడుతూ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఐరిస్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐరిస్ ఫెయిర్ లో సాధించిన విజయాలు యువతకు స్ఫూర్తి కలిగిస్తాయని వారు తమ అనుభవాల ద్వారా శాస్త్రీయ రంగ అభివృద్ధికి కృషి చేయడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
ఈ ఏడాది వర్చువల్ విధానంలో జరిగిన ఐరిస్ నేషనల్ ఫెయిర్ లో 65,000 మందికి పైగా విద్యార్థులు, విజ్ఞాన ఔత్సాహికులు పాల్గొన్నారు. 21 తరగతుల్లో వివిధ అంశాలపై రూపొందిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. టీమ్ ఇండియా 2021ని ఎంపిక చేయడానికి ఈ ప్రాజెక్టులను లోతుగా పరిశీలించారు. విజేతలుగా నిలిచి టీమ్ ఇండియా 2021 సభ్యులుగా ఎంపిక అయిన వారి ప్రతిభాపాటవాలను ఐరిస్ సైంటిఫిక్ రివ్యూ కమిటీ సభ్యులు మరింత మెరుగు పరచి వారిని రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ పోటీలో పాల్గొడానికి సిద్ధం చేశారు.
కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహకారంతోబ్రాడ్‌కామ్ సమకూర్చిన నిధులతో ఎక్స్‌స్టెంప్లర్ ఎడ్యుకేషన్ లింకర్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారత విద్యార్థులు దీనిలో దరఖాస్తుల ఆహ్వానాలకు ప్రతిస్పందిస్తూ పాల్గొనవచ్చును.
నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ నిర్వహించే సైన్స్ ఫెయిర్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిర్వహించే జవహర్‌లాల్ నెహ్రూ సైన్స్ ఫెయిర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సైన్స్ ఎగ్జిబిషన్,ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అవార్డుల కార్యక్రమాలకు కొనసాగింపుగా ఐరిస్ నేషనల్ ఫెయిర్ ను నిర్వహించడం జరుగుతున్నది.
అంతర్జాతీయ ప్రదర్శనల్లో భారతదేశం తరఫున అత్యుత్తమ ప్రాజెక్టులు ప్రదర్శితమయ్యేలా చూడడానికి ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచే విద్యార్థులు ఐరిస్ నేషనల్ ఫెయిర్ లో పాల్గొంటారు. జాతీయ స్థాయి ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచే విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి వారి ప్రాజెక్టులను మరింత మెరుగుపరచి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి నిపుణులు సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. దీని తరువాత ఒకో ప్రదర్శన నుంచి అయిదు ప్రాజెక్టులను ఎంపిక చేసి వాటిని ఐరిస్ జాతీయ ప్రదర్శనలో ప్రదర్శిస్తారు. ఎంపికలో 70: 30 విధానాన్ని అమలు చేస్తుంటారు. బహిరంగ పోటీ ద్వారా 70 శాతం విద్యార్థులను మిగిలిన 30 శాతం మంది విద్యార్థులను ప్రదర్శనల నుంచి ఎంపిక చేస్తారు.
Please Click the Annexure
(Release ID: 1732567)
Visitor Counter : 211