వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పంట బీమా వారం కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

రైతులకు రూ.95,000 కోట్ల క్లైముల మైలు రాయిని చేరుకున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

ప్రతి రైతుకు రక్షణ కవచంగా నిలుస్తున్న పీఎం ఫసల్ బీమా యోజన : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

దేశంలో ఫసల్ బీమా యోజన విస్తరించాల్సి ఉందని తెలిపిన వ్యవసాయ మంత్రి

రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు ఫసల్ బీమా యోజన అమలులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి

Posted On: 01 JUL 2021 3:56PM by PIB Hyderabad

75 సంవత్సరాల భారత స్వాతంత్య్రన్ని   పురస్కరించుకుని ఇండియా @75 ప్రచారం ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా పంట బీమా వారంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పంట బీమా యోజన కోసం పంట బీమా అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు.

 

 

ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ, ప్రతి రైతుకు భద్రతా రక్షణ కల్పించడమే ఫసల్ బీమా యోజన లక్ష్యం అన్నారు. ఈ పథకం రైతులకు చెల్లించిన రూ .95,000 కోట్ల క్లెయిమ్‌ల మైలురాయిని సాధించిందని ఆయన ప్రకటించారు.

పిఎంఎఫ్‌బివై అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా కంపెనీలకు ముఖ్య పాత్ర ఉందని మంత్రి అన్నారు. వారి కృషి ఫలితమే, గత 4 సంవత్సరాల్లో, ప్రీమియం రూ .17 వేల కోట్లు రైతులు జమ చేశారు, దీనికి ప్రతిగా రూ .95 వేల కోట్లకు పైగా వారికి క్లెయిమ్‌లుగా అందించారు. దేశంలో ఈ పథకాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని, తద్వారా దాని పరిధిని పెంచవచ్చని, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు.

పంటల బీమా వారమంతా పిఎమ్‌ఎఫ్‌బివైలో రైతులను నిమగ్నం చేయడాన్ని కొనసాగించే ఐఇసి వ్యాన్‌లను వ్యవసాయ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రైతులూ, క్షేత్ర స్థాయి కోఆర్డినేటర్లకు ఈ పథకం, దాని ప్రయోజనాలు, పంట భీమా ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పిఎమ్‌బిఎఫ్‌వై ఇ-బ్రోచర్, తరుచూ వచ్చే ప్రశ్నలు (ఎఫ్ ఏ క్యూ) పుస్తకాన్ని, గైడ్‌బుక్‌ను ఆయన ఆవిష్కరించారు.

వారమంతా, ఖరీఫ్ 2021 సీజన్లో అన్ని నోటిఫైడ్ ప్రాంతాలు / జిల్లాల్లో ఈ ప్రచారం జరుగుతుంది. పంటల బీమా అంతంత మాత్రంగానే ఉన్న,  వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించిన 75 ఆకాంక్ష / గిరిజన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జూలై 1 నుండి 20 జూలై 2021 వరకు, ఈ ప్రాంతాల / జిల్లాల రైతులతో పిఎమ్‌ఎఫ్‌బివై వ్యాన్లు, రేడియో, ప్రాంతీయ వార్తాపత్రికలు, డిజిటల్ పెయింటింగ్‌తో సహా గోడ పెయింటింగ్‌ల ద్వారా బహుళ స్థాయిలో వారందరిని భాగస్వామ్యం చేసే  కార్యకలాపాలు నిర్వహిస్తారు. 

ఎన్‌సిఐపి పోర్టల్, సిఎస్‌సి కేంద్రాలు, బీమా కంపెనీలు, బ్యాంకులతో ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి, వివిధ పరిస్థితులలో బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఫిర్యాదుల పరిష్కారం మరియు పంట నష్టం నివేదించడం  గురించి క్షేత్ర స్థాయి, డిజిటల్ కార్యక్రమాలతో రైతులలో అవగాహన కలిగిస్తారు. గిరిజన ప్రాంతాలు, ఆశాజనక జిల్లాల్లోని రైతులతో పాటు, ఈ ప్రచారంలో మహిళా రైతులు కూడా పాల్గొంటారు.

సోషల్ మీడియాలో వీడియోలు మరియు ఫోటో స్టోరీల ద్వారా, ఈ పథకం ద్వారా లబ్ది పొందడమే కాకుండా మొత్తం వ్యవసాయ సమాజానికి వారి ఆలోచన-నాయకత్వం ద్వారా సహాయం చేసిన లబ్ధిదారుల రైతుల కథలను బయటకు తీసుకురావడం కూడా ఈ ప్రచారం లక్ష్యంగా ఉంది.

అనేక రాష్ట్రాలు చేపట్టిన ప్రారంభోత్సవ వేడుకలలో, కింద స్థాయి వరకు ప్రచారాలు నిర్వహించే చోట కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బ్యాంకులు, గుర్తించిన 75 బ్లాక్స్ / సర్కిల్స్ / తహసిల్స్‌లో రైతులను చేరడానికి కంపెనీలు, సిఎస్సిలుభీమా వంటి ఇతర వాటాదారులు కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు. రైతులందరూ ముందుకు వచ్చి పంటల బీమా ప్రయోజనాలను పొందాలని, సంక్షోభ సమయాల్లో స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనీర్భర్ కిసాన్ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.

పిఎంఎఫ్‌బివై 2016 లో పిఎం శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రారంభం అయింది. భారతదేశ రైతులకు ప్రకృతి వైవిధ్య పరిస్థితుల నుండి ఆర్థిక భద్రత కల్పించడం మరియు వారి కృషికి తగు భద్రత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. . ఈ రోజు వరకు, ఈ పథకం 29.16 కోట్లకు పైగా రైతు దరఖాస్తులను (సంవత్సరానికి 5.5 కోట్ల రైతు దరఖాస్తులు) బీమా చేసింది. 5 సంవత్సరాల కాలంలో 8.3 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించింది. అంతేకాకుండా రూ. 20,000 కోట్ల రైతుల వాటా నుండి  రూ .95,000 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించడం జరిగింది. 

వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ పార్శోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్‌తో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సీనియర్ అధికారులు, బీమా సంస్థ అధికారులు మరియు ఇతర వాటాదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

Click here for E-Brochure(Release ID: 1732039) Visitor Counter : 136