ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య పరిశోధన రంగం లో భారతదేశాని కి, నేపాల్ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
30 JUN 2021 4:19PM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) 2020 నవంబర్ 17న, నేపాల్ కు చెందిన నేపాల్ హెల్థ్ రిసర్చ్ కౌన్సిల్ (ఎన్‌హెచ్ఆర్‌సి) 2021 జనవరి 4న సంతకాలు చేసిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.
పరస్పర ప్రయోజనాలు ముడిపడినటువంటి సరిహద్దులకు ఆవలి ఆరోగ్య అంశాలు, ఆయుర్వేదం/ సాంప్రదాయక ఔషధాలు, ఓషధీ మొక్కలు, జల వాయు పరివర్తన, ఆరోగ్యం, అసాంక్రామిక వ్యాధులు, మానసిక స్వస్థత, జనాభా ఆధారిత కేన్సర్ రిజిస్ట్రీ, ఉష్ణదేశీయ వ్యాధులు (రోగ వాహక వ్యాధులైన డెంగీ, చికన్‌గన్యా, మలేరియా, జెఇ వగైరా), చలి జ్వరం, క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ, ఆరోగ్య పరిశోధన సంబంధిత నైతిక నియమావళి, జ్ఞానం ఆదాన ప్రదానాల ద్వారా సామర్ధ్యం పెంపుదల, నైపుణ్య సంబంధిత ఉపకరణాలు, ఫెలోస్, ఉపకరణాల స్వీకరణ కు ఉద్దేశించినటువంటి సహకారం, మార్గదర్శక సూత్రాలు, ఆరోగ్య పరిశోధన కు సంబంధించిన ప్రోటోకాల్స్, ఉత్తమ అభ్యాసాలు వంటి వాటికి సంబంధించిన సంయుక్త పరిశోధన కార్యకలాపాల లో సహకరించుకోవాలి అనేది ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యాల లో భాగం గా ఉంది.
ఈ ఎంఒయు లో భాగం గా ఆమోదించే పరిశోధన తాలూకు కాంపోనంట్స్ కు అయ్యే ఖర్చు ను ప్రతి ఒక్క పక్షం భరించవలసి ఉంటుంది. ఈ పరిశోధన ను ఆయా దేశాల లో నిర్వహించడం గాని, లేదా మూడో పక్షం ఆర్థిక సహాయం కోసం కలసి దరఖాస్తు చేసుకోవడానికి గాని ఆస్కారం ఉంటుంది. ఆమోదం తెలిపిన సహకార పూర్వక ప్రాజెక్టుల కు గాను శాస్త్రవేత్త ల ఆదాన ప్రదానం కోసం, వారిని పంపించే పక్షం (దేశం) శాస్త్రవేత్త ల ప్రయాణాని కి అయ్యే ఖర్చు ను తానే భరించవలసి ఉంటుంది. సదరు శాస్త్రవేత్త/పరిశోధకుల వసతి ఖర్చులు, మనుగడ కు అయ్యే ఖర్చుల ను వారిని స్వాగతించే పక్షం సమకూర్చవలసి ఉంటుంది. వర్క్ శాపు లు/ సమావేశాల కోసం ఖర్చుల ను భరించే అంశం లో ఆ కాలం లో అందుబాటు లో ఉన్న నిధుల ను బట్టి ఎప్పటికి అప్పుడు నిర్ణయాన్ని తీసుకొనేందుకు వీలు ఉంటుంది. ఈ కార్యకలాపాలన్నిటిని అమలు పరచడానికి చేసుకొనే ఏర్పాటుల పై - అటువంటి కార్యక్రమం ఆరంభమయ్యే కన్నా ముందే- ఉభయ పక్షాలు ఒక అంగీకారానికి రావలసి ఉంటుంది.
(Release ID: 1731570)