ఆర్థిక మంత్రిత్వ శాఖ

మూలధన వ్యయం మరియు మౌలిక సదుపాయాల ప్రణాళికపై 6 వ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన - కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

మూలధన వ్యయాన్ని ముందుగా వినియోగించాలనీ, ఎం.ఎస్.ఎం.ఈ. ల బకాయిలను త్వరగా చెల్లించాలనీ, ఆస్తుల మదింపును వేగవంతం చేయాలనీ, మంత్రిత్వ శాఖలు, వాటి ఆధీనంలోని సి.పి.ఎస్.ఈ. లను కోరడం జరిగింది.

Posted On: 29 JUN 2021 6:15PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల రోడ్‌-మ్యాప్ గురించి చర్చించడానికి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు, ఇక్కడ, ప్రభుత్వ సీనియర్ అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాల రోడ్‌ మ్యాప్‌పై మంత్రిత్వ శాఖలు / విభాగాలతో ఆర్థిక మంత్రి నిర్వహించిన 6 వ సమీక్ష సమావేశం ఇది.

మూలధన వ్యయం మరియు మౌలిక సదుపాయాల ప్రణాళిక పై నిర్వహించిన 6వ సమీక్షా  సమావేశానికి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్  వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  అధ్యక్షత వహించారు.ఈ చిత్రంలో - కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి & వ్యయ శాఖ  కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్  మరియు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ కూడా ఉన్నారు.

ఈ సమావేశంలో, మంత్రిత్వ శాఖలతో పాటు వాటి సి.పి.ఎస్‌.ఈ. ల మూలధన వ్యయం (క్యాపెక్స్) ప్రణాళికలు;  బడ్జెట్ ప్రకటనల అమలు స్థితి; మౌలిక సదుపాయాల పెట్టుబడులను వేగవంతం చేసే చర్యల గురించి, చర్చించారు. ఈ సమావేశంలో -  ఆర్థిక శాఖ కార్యదర్శి; కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు); కార్యదర్శి (ప్రభుత్వరంగ సంస్థలు); కార్యదర్శి (స్టీల్); కార్యదర్శి (గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు); కార్యదర్శి (పెట్రోలియం మరియు సహజ వాయువు); కార్యదర్శి (అంతరిక్షం) తో పాటు, ఈ మంత్రిత్వ శాఖలు / విభాగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు / సి.ఈ.ఓ. లు పాల్గొన్నారు.

మంత్రిత్వ శాఖలు, వాటి ఆధ్వర్యంలోని సి.పి.ఎస్‌.ఈ. ల మూలధన వ్యయ పనితీరును సమీక్షిస్తున్న సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ, మహమ్మారి అనంతర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడంలో మెరుగైన క్యాపెక్స్ కీలక పాత్ర పోషిస్తుందని, నొక్కిచెప్పారు.  అదేవిధంగా, వాటి మూలధన వ్యయాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఆమె, మంత్రిత్వ శాఖలను ప్రోత్సహించారు.  వారి క్యాపెక్స్ లక్ష్యాల కంటే ఎక్కువ సాధించాలనే లక్ష్యాన్ని, నిర్దేశించుకోవాలని కూడా మంత్రిత్వ శాఖలను, ఆమె, అభ్యర్థించారు.  శ్రీమతి సీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2020-21 బడ్జెట్ అంచనా కంటే 34.5 శాతం ఎక్కువగా, 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో మూలధన పెట్టుబడి 5.54 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు, తెలియజేశారు.   ఏదేమైనా, మూలధన వ్యయాన్ని పెంచడానికి బడ్జెట్ వైపు నుంచి చేసే ప్రయత్నాలను ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి చేయవలసి ఉందని, ఆమె పేర్కొన్నారు. 

పురోగతిని సమీక్షిస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, మూలధన వ్యయాన్ని వేగవంతం చేయాలని, ముందుగా ఖర్చు చేయడానికి ప్రయత్నాలు చేయాలని, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు.  ప్రైవేటు పెట్టుబడులను సులభతరం చేసి, అడ్డంకులను తొలగించడం ద్వారా, క్యాపెక్స్ ను ఫ్రంట్ లోడ్ చేయాలని, ఉక్కు మంత్రిత్వ శాఖను కోరారు.  2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల మోనెటైజేషన్ను వేగవంతం చేయాలని, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను కోరారు.

మౌలిక సదుపాయాల వ్యయం అంటే, కేవలం మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో సమకూర్చే వ్యయం మాత్రమే కాదనీ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేటు రంగాల మౌలిక సదుపాయాల వ్యయం కూడా, ఇందులో కలిసి ఉందని సీతారామన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.  అదనపు బడ్జెట్ వనరుల ద్వారా ప్రభుత్వ వ్యయం కూడా ఇందులో ఉంది.  అందువల్ల, వినూత్న నిర్మాణ మరియు ఫైనాన్సింగ్ ద్వారా నిధులను పొందడంలో చురుకుగా పనిచేయడంతో పాటు, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి సహకారం అందించడానికి, మంత్రిత్వ శాఖలు చురుకుగా పని చేయాలి. 

అనుకూలమైన ప్రాజెక్టుల కోసం, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పి.పి.పి) విధానాలను కూడా, మంత్రిత్వ శాఖలు అన్వేషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి సూచించారు.  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్‌.ఎం.ఈ.ల) బకాయిలను, 2021 జులై, 31వ తేదీ లోపు చెల్లించాలని కూడా శ్రీమతి సీతారామన్, ఈ సందర్భంగా, మంత్రిత్వ శాఖలను, వాటికి అనుబంధంగా ఉన్న సి.పి.ఎస్‌.ఈ. లను కోరారు.

సమావేశం చివరిలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, పెద్ద ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం ముందుగా ఖర్చు పెట్టాలని, ఈ సాధన సమయపాలన కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలనీ, మంత్రిత్వ శాఖల కార్యదర్శులను కోరారు.  వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో, ఆయా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని శ్రీమతి సీతారామన్ మంత్రిత్వ శాఖలను కోరారు.(Release ID: 1731360) Visitor Counter : 64