రాష్ట్రపతి సచివాలయం
బాబా సాహెబ్ విలువలు, ఆదర్శాల ప్రకారం సమాజాన్నీ, దేశాన్నీ నిర్మించడంలోనే మన నిజమైన విజయం ఉంది : రాష్ట్రపతి కోవింద్
లక్నోలో డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ స్మారక, సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన - భారత రాష్ట్రపతి
Posted On:
29 JUN 2021 3:47PM by PIB Hyderabad
బాబా సాహెబ్ విలువలు, ఆదర్శాల ప్రకారం సమాజాన్నీ, దేశాన్నీ నిర్మించడంలోనే మన నిజమైన విజయం ఉందని, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, పేర్కొన్నారు. ఈ దిశగా మనం పురోగతి సాధించాము, అయితే, ఈ విషయంలో మనం, ఇంకా చాలా సాధించవలసిన అవసరం ఉందని ఆయన, పిలుపునిచ్చారు. ఆయన, ఈ రోజు (29 జూన్, 2021) లక్నో లో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మారక, సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించారు.
భారత దేశ నిర్మాణంలో, డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ బహుముఖ వ్యక్తిత్వం, అమూల్యమైన సహకారం, ఆయన అసాధారణ సామర్థ్యాన్నీ, ప్రతిభనూ, వెల్లడించాయని రాష్ట్రపతి కొనియాడారు. ఆయన కేవలం ఒక విద్యావేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది, రాజకీయవేత్త, పాత్రికేయుడు, సామాజిక శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మాత్రమే కాదు. సంస్కృతి, మతం, ఆధ్యాత్మికత రంగాల్లో కూడా, ఆయన, అమూల్యమైన కృషి చేశారు.
నైతికత, సమానత్వం, ఆత్మగౌరవం, భారతీయత అనే ఈ నాలుగు, బాబాసాహెబ్ అనుసరించిన, అతి ముఖ్యమైన ఆదర్శాలని, రాష్ట్రపతి, పేర్కొన్నారు. ఈ నాలుగు ఆదర్శాల సంగ్రహావలోకనాలు, ఆయన ఆలోచనలు, చర్యలలో, మనకు కనిపిస్తాయి. ఆయన సాంస్కృతిక ఆలోచన ప్రాథమికంగా సామరస్యం పై ఆధారపడి ఉంది. డాక్టర్ అంబేద్కర్ బుద్ధుని ఆలోచనలను వ్యాప్తి చేశారు. కరుణ, సోదరభావం, అహింస, సమానత్వం, పరస్పర గౌరవం వంటి భారతీయ విలువలతో పాటు, సామాజిక న్యాయం యొక్క ఆదర్శాన్ని గ్రహించడం, ఆయన ప్రయత్నాల లక్ష్యమనీ, బుద్ధ భగవానుడు ప్రబోధించిన కరుణ, సామరస్యం వంటి సందేశాలే, ఆయన అతని జీవితం మరియు రాజకీయాలకు ఆధారమనీ, రాష్ట్రపతి వివరించారు. నైతికత మరియు సామరస్యం యొక్క సాంస్కృతిక విలువల ఆధారంగా రాజకీయాల అవసరాన్ని బాబాసాహెబ్ నొక్కి చెప్పేవారనీ, అదేవిధంగా తాను మొదట భారతీయుడుననీ, తరువాత భారతీయుడుననీ, చివరిగా భారతీయుడుననీ, ఆయన, చెప్పేవారని, రాష్ట్రపతి, ఈ సందర్భంగా, గుర్తు చేశారు.
మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, బాబాసాహెబ్ ఎప్పుడూ వాదించేవారని, రాష్ట్రపతి అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగంలో పురుషులతో సమానంగా మహిళలకు సమానమైన ప్రాథమిక హక్కు ఇవ్వబడింది. ఆస్తి, వివాహం, జీవితంలోని ఇతర అంశాల వారసత్వానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక బిల్లు ద్వారా సమానత్వానికి ప్రాథమిక హక్కుకు స్పష్టమైన చట్టపరమైన ఆధారాన్ని ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ఈ రోజు మన న్యాయ వ్యవస్థ మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం వంటి అనేక అంశాలపై ఆయన సూచించిన మార్గంలోనే పురోగమిస్తోంది. బాబాసాహెబ్ యొక్క దూరదృష్టి ఆలోచన, ఆయన కాలానికి చాలా ముందుందన్న విషయాన్ని, ఇది చూపించిందని, రాష్ట్రపతి పేర్కొన్నారు.
లక్నోలో బాబాసాహెబ్ కు స్మారక రూపంలో సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్య ప్రశంసనీయమని, రాష్ట్రపతి అభినందించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ సాంస్కృతిక కేంద్రం పౌరులందరికీ, ముఖ్యంగా యువతరానికి, డాక్టర్ అంబేద్కర్ ఆదర్శాలు, లక్ష్యాల పట్ల అవగాహన కల్పించడంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని, ఆయన, విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1731293)
Visitor Counter : 260