ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం
కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన టీకా డోసులు 31.69 కోట్లు
ఇంకా రాష్టాల దగ్గర 1.15 కోట్లకు పైగా టీకా డోసుల నిల్వ
Posted On:
28 JUN 2021 11:07AM by PIB Hyderabad
కోవిడ్ – 19 టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయటంలోను, పరిధిని విస్తృతం చేయటంలోను కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోంది. సార్వత్రిక టీకాల కార్యక్రమం 2021 జూన్ 16 న ప్రారంభం కాగా అందుబాటులో ఉన్న టీకా డోసుల సంఖ్య పెరిగేకొద్దీ వాటి అందుబాటు గురించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందుగానే సమాచారం అందించటం ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగే వెసులుబాటు కల్పించింది.
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం అన్ని రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకామందు ఉచితంగా అందజేస్తోంది. ఈ కొత్త దశల టీకాల కోసం దేశవ్యాప్తంగా తయారీదారుల దగ్గర అందుబాటులో ఉన్న టీకామందులో 75% మేర కేంద్రప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తోంది.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 31.69 కోట్లకు పైగా (31,69,40,160) టీకా డోసులు అందజేసింది. రాష్ట్రాలకు అందించే ఉచిత టీకాలలో ఇవి భాగం. ఇందులో వృధా తో సహా రాష్టాలు వాడుకున్న టీకా డోసులు
30,54,17,617 అని ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఇంకా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర 1.15 కోట్లకు పైగా (1,15,22,543) డోసుల నిల్వ ఉన్నట్టు సమాచారం.
(Release ID: 1730867)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam