ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 తాజా స‌మాచారం

Posted On: 26 JUN 2021 9:21AM by PIB Hyderabad

దేశ వ్యాప్త టీకా డ్రైవ్ కింద ఇప్పటివరకు 31.50 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు టీకాల‌ను ఇప్పించ‌డం జ‌రిగింది.
గ‌డిచిన 24 గంటల్లో భారత్‌లో 61.19 లక్షల కోట్ల వ్యాక్సిన్లు వేయ‌డ‌మైంది.

గ‌డిచిన 24 గంటల్లో భారత్‌లో 48,698 కొత్త కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలో యాక్టివ్ కేసుల లోడు 5,95,565కు క్షీణించింది; 86 రోజుల తరువాత తొలిసారిగా 6 లక్షల కన్నా దిగువ‌కు యాక్టివ్ కేసులు త‌గ్గాయి.

భారతదేశం యొక్క యాక్టివ్ కాసేలోడ్ 5,95,565 కు క్షీణించింది; 86 రోజుల తరువాత 6 లక్షల కన్నా దిగువ‌కు ఇవి చేరాయి

మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.97 శాతంగా ఉన్నాయి

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం రిక‌వ‌రీలు 2,91,93,085గా నిలిచాయి

గ‌డిచిన‌ 24 గంటల్లో 64,818 మంది రోగులు కోలుకున్నారు

వరుసగా 44వ రోజు కూడా రోజువారీ రికవరీలు డైలీ కొత్త కేసులను మించిపోయాయి

రికవరీ రేటు 96.72 శాతానికి పెరిగింది

వారం మొత్తం పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది, ప్రస్తుతం ఇది 2.97 శాతంగా ఉంది

రోజువారీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా ఉంది. వరుసగా 19 రోజులు ఇది 5 శాతం కన్నా దిగువ‌నే న‌మోదయింది.

పరీక్ష సామర్థ్యం గణనీయంగా పెరిగింది - మొత్తం 40.18 కోట్ల పరీక్షలు నిర్వ‌హించ‌డ‌మైంది.



(Release ID: 1730543) Visitor Counter : 161