ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్నుల విషయం లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం తో పాటు వాటి వసూళ్ళ లో కూడా సహాయం చేసుకోవడానికి గాను భారతదేశాని కి, సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ కు మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
23 JUN 2021 12:56PM by PIB Hyderabad
పన్నుల విషయం లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం తో పాటు వాటి వసూళ్ళ లో కూడా సహాయం చేసునకోవడానికి గాను భారతదేశాని కి, సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ కు మధ్య ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఒప్పందం వివరాలు:
i) ఇది భారతదేశ గణతంత్రాని కి, సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ కు మధ్య కుదిరిన ఒక కొత్త ఒప్పందం. రెండు దేశాల మధ్య ఇది వరకు అటువంటి ఒప్పదం ఏదీ లేదు.
ii) ఈ ఒప్పందం ప్రధానం గా ఉభయ దేశాల మధ్య సమాచార ఆదాన ప్రదానానికి మార్గాన్ని సుగమం చేయాలని, అలాగే పన్ను క్లెయిము ల సేకరణ లో ఒక దేశాని కి మరొక దేశం సహాయాన్ని అందించుకోవాలని ప్రతిపాదిస్తోంది.
iii) విదేశం లో పన్నుల పరిశీలన తాలూకు నిబంధనలు కూడా ఈ ఒప్పందం లో ఉన్నాయి. ఈ నిబంధన లు ఒక దేశం ఇతర దేశం ప్రతినిధుల ను తన భూభాగం లోకి (దేశీయ చట్టాల ప్రకారం వీలు ఉన్నంత మేరకు) ప్రవేశించి వ్యక్తుల తో భేటీ కావడానికి, పన్నుల రికార్డుల ను పరిశీలించడానికి అనుమతి ని ఇస్తాయి.
ప్రభావం:
భారత గణతంత్రాని కి, సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ కు మధ్య ఒప్పందం బ్యాంకు ల, ఇతర ఆర్థిక సంస్థ ల ద్వారా అందజేయబడే చట్టపరమైన, ప్రయోజనకారక యాజమాన్యానికి సంబంధించిన సమాచారం కలిసి ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య పన్ను క్లెయిము ల సేకరణ లో నూ సహకారానికి వీలు ను కల్పిస్తుంది. ఈ ప్రకారం గా, ఇది విదేశం లో పన్నుల ఎగవేత పై, పన్నుల చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకోవడం (వీటి వల్లనే లెక్కలలోకి రాని నల్ల ధనమంటూ పోగుపడుతోంది) పై పోరాడాలన్న భారతదేశ నిబద్ధత ను పటిష్ట పరచనుంది.
పూర్వరంగం:
సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ తో ఇదివరకు భారతదేశాని కి ఎలాంటి ఒప్పందమూ లేదు. మరి భారతదేశం చాలా కాలం గా ఈ ఒప్పందం కోసం సంప్రదింపుల ను జరుపుతూ వచ్చింది. ఎట్టకేలకు, సెంట్ విన్సెంట్ ఎండ్ ది గ్రెనెడాయిన్స్ భారతదేశం తో ఈ ఒప్పందానికి తుదిరూపు ను ఇవ్వడం పట్ల అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మిగిలిన ట్యాక్స్ క్లెయిము ల సేకరణ కు సమాచారం పరస్పర అందజేత తో పాటు సహాయాన్ని అందించుకొనే మాధ్యమం ద్వారా ఇరు దేశాల మధ్య పన్ను ల సంబంధి సహకారాన్ని కూడా పెంపొందించనుంది.
***
(Release ID: 1729742)
Visitor Counter : 169