శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వ హించిన డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ
Posted On:
22 JUN 2021 8:52AM by PIB Hyderabad
భారతప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం , దానికి చెందిన, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. యోగా ఫర్ వెల్‌నెస్‌పై ఇవి దృష్టి కేంద్రీకరించాయి.
ఈ సందర్భంగా డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ, శారీరక ,మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత ప్రధానమైనదో తెలియజేశారు. కోవిడ్ నిబంధనల మధ్య శరవేగంతో ముందుకుపోతున్న ప్రస్తుత ప్రపంచంలో జీవన శైలికి సంబంధించిన అనారోగ్యాలను, సాంక్రమికేతర వ్యాధులను దూరంగా ఉంచడానికి యోగా సరైనదని అన్నారు. ప్రపంచం మొత్తం శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించడం సముచితంగా ఉందన్నారు. యోగాకు స్వల్ప మార్గనిర్దేశం సరిపోతుందని , ప్రజలకు ఇది ఎంతగానో అనువైనదని అన్నారు.
డిబిటి-ఎన్.ఎబిఐ, డిబిటి-సిఐఎబి మొహాలీలు సంయుక్తంగా కరోయోగా-భగాయేరోగ్ పేరుతో ఒక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యు)కి చెందిన ప్రొఫెసర్, డాక్టర్ అజయ్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ, ఆత్మసంతృప్తికలిగిన వారు ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు. డాక్టర్ శాస్త్రి పలు యోగాఅభ్యాసాలను చేసి చూపించారు. ఆరోగ్యంగా ఉందడడానికి క్రమం తప్పకుండా ప్రాణయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎబిఐ, సిఐఎబికి చెందిన స్కాలర్లు, సిబ్బంది, ఫాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

బిఐఆర్ ఎసి, డిబిటి కి చెందిన ప్రభుత్వరంగ సంస్థ. ఆయుష్ మంత్రిత్వశాఖ జారీ చేసిన కామన్ యోగా ప్రొటోకాల్ (సివైపి) ప్రకారం తమ సిబ్బందికి ఆన్‌లైన్ యోగా సెషన్‌ను ఏర్పాటు చేసింది.
ఫరీదాబాద్‌కు చెందిన బిబి-ఆర్‌సిబి అంతర్జాతీయ యోగాదినోత్సావాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసనాలైన తాడాసన, భద్రాసన, వజ్రాసన, ఉష్ట్రాసన, శశాంకాసన,వక్రాసన తదితరాలను వర్చువల్ పద్ధతిలో ప్రదర్శించారు. ఈ వర్చువల్ కార్యక్రమానికి ఆర్‌సిబి సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.
భువనేశ్వర్‌కు చెందిన డిబిటి -ఐఎల్ఎస్ నిత్య జీవితంలో యోగా అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎస్.ఒ.ఎ విశ్వవిద్యాలయం నుంచి అఖిల్ రాణా యోగాతో ఉండండి, ఇంట్లో ఉండండి శీర్షికన ఒక ఉపన్యాసం ఇచ్చారు. వ్యక్తుల శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంత అవసరమో ఆయన వివరించారు. వారు పలు సులభ యోగాసనాలను ప్రదర్శించారు. ఇంట్లోను, పని ప్రదేశంలోనూ ఆచరించడానికి వీలుగా వీటిని చేసి చూపారు. అలాగే డైరక్టర్ డాక్టర్ అజ్ పరీదా మాట్లాడుతూ, ధ్యానం వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేస్తాయని తద్వార వైరల్ ఇన్‌ఫెక్షన్ల రాకుండా అడ్డుకోవచ్చని లేదా దాని తీవ్రత తగ్గించుకోవచ్చని చెప్పారు.
డిబటి- -ఎన్ఐఎబి , హైదరాబాద్ కూడా యోగా ఉత్సవాలను నిర్వహించింది. ఆన్‌లైన్ ద్వారా యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యోగా ప్రదర్శనలు , యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. డైరక్టర్ ఇన్ ఛార్జి డాక్టర్ నాగేంద్ర ఆర్. హెగ్డే , రోజువారీ యోగా సాధన, యోగా దినోత్సవంలో విద్యార్ధులు, ప్రాజెక్టు సిబ్బంది, ఉద్యోగులు ఆన్‌లైన్ లో పాల్గొనేలా ఉత్సాహపరిచారు.
బిటి-ఐబిఎస్‌డి ఇంఫాల్ , ఐసిఎఆర్- సెఎంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రిసెర్చి స్టేషన్ , తమిళనాడు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి. మణివేల్‌ను, మణిపూర్‌కు చెందిన యోగా ఫిజిక్ ఇన్‌స్టిట్యూట్, స్టడీస్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎల్.డబ్ల్యు. అనంతను, హైదరాబాద్‌కు చెందిన వెల్‌నెస్ నిపుణులు శ్రీ థామస్ నిరంజన్ కుమార్‌ను అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారు యోగ మానవ శరీరానికి ఏరకంగా ఉపయోగపడుతుందో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి వివరించారు.
డిబిటి-ఎన్‌సిసిఎస్ , పూణె, డిబిటి ఎన్‌బిఆర్‌సి ఫరీదాబాద్ కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. వీరు 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రొటోకాల్‌కు అనుగుణంగా యోగా సెషన్ నిర్వహించారు. సంస్థకు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ,పరిశోధకులు వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్-19 కు సంబంధించి సామాజిక దూరం , ఇతర ప్రొటొకాల్స్ పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
తిరువనంతపురంలోని డిబిటి- ఆర్‌జిసిబి లైవ్, ఆన్‌లైన్ యోగా సెషన్‌ను యోగాదినోత్సవం నాటి ఉదయం నిర్వహించింది. ఇందులో సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ యోగా కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. లైవ్ సెషన్‌ను కొద్దిమందితో ఉదయం ఏడున్నరకు నిర్వహించారు. ఆర్‌జిసిబి సిబ్బంది, విద్యార్థుల కోసం ఒక ప్రసంగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్త,డాక్టర్ టిపి శశికుమార్ యోగా, ధ్యానం ద్వారా మానసిక, శారీరక, భావోద్వేగపరమైన, భౌతిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాల గురించి మాట్లాడారు. యోగా మాత్రమే కాదు, జీవితంలో దేనినైనా పట్టుదలతో ఆచరించడం, నిబద్ధత కలిగి ఉండడంలోని ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.



***
(Release ID: 1729397)