భారత పోటీ ప్రోత్సాహక సంఘం
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. సంస్థకు సీసీఐ ఆమోదం
Posted On:
22 JUN 2021 11:19AM by PIB Hyderabad
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్‌ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం-2002లోని 31(1) సెక్షన్ ప్రకారం ఆమోదం తెలిపింది.
యూబీఎల్‌లో గరిష్టంగా 16.40 శాతం వాటాను హెచ్‌ఐబీవీ పొందడానికి ఈ లావాదేవీ సంబంధించినది.
హెచ్‌ఐబీవీ ఒక పెట్టుబడుల సంస్థ. తనకు తానుగా ఏ వ్యాపారం చేయదు. హైనెకెన్ సమూహ సంస్థల్లో భాగంగా ఉన్న డచ్‌యేతర సంస్థలన్నింటిలో ఇది ప్రత్యక్ష లేదా పరోక్ష వాటాదారు సంస్థ. బీర్, ఆల్కహాల్ లేని బీర్, పండ్లరసాలు, పండ్లరసాల ఆధారిత పానీయాలు, ఇతర పానీయాల ఉత్పత్తి, ప్యాకింగ్, పంపిణీ, మార్కెటింగ్, అమ్మకాలు చేస్తున్న అంతర్జాతీయ సంస్థల సముదాయమే హైనెకెన్ సమూహం.
కంపెనీల చట్టం-1956 కింద ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ సంస్థ యూబీఎల్. భారత్‌లో బీర్ తయారీ, అమ్మకాలను చేస్తోంది. ఈ సంస్థ వాటాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదయ్యాయి.
సీసీఐ నుంచి సవివర ఆదేశం అందాల్సివుంది.
****
(Release ID: 1729386)
Visitor Counter : 136