విద్యుత్తు మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వ‌హించిన ఎన్‌టీపీసీ

Posted On: 21 JUN 2021 12:47PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న పీపీఎస్‌యు సంస్థ‌ అయిన ఎన్‌టీపీసీ ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వ‌హించింది. ఎన్‌టీపీసీ యొక్క బలం దాని ప్రేరేపిత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సిబ్బంది. వీరు ఏలాంటి పరిస్థితిలోనైనా దేశానికి సేవ చేయడానికి అన్న‌వేళ‌ల సిద్ధంగా ఉంటారు. ప్ర‌పంచానికి స‌రిస‌మానంగా ఎన్‌టీపీసీ ఉన్‌చహార్‌లో అంత‌ర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి గాను.. వీడియో కాన్ఫరెన్స్ సహాయం తీసుకున్నారు. తద్వారా ఇంట్లోను, కుటుంబంతో కలిసి యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వీలు క‌లిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఎన్‌టీపీసీ అన్‌చహార్ విభాగంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగా సాధన చేప‌ట్టారు. ఎన్‌టీపీసీ సీనియర్ అధికారులు బాల్ భవన్‌లోను ఇతర ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. యోగాభ్యాసం ప్రారంభించే ముందు ఎన్‌టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉంచహార్ శ్రీ భోలానాథ్ ప్రసంగించారు. 'శాంతి, సామరస్యం మరియు పురోగతి కోసం యోగా అనేదే త‌మ నినాదమని అన్నారు'. యోగా ఆవ‌శ్య‌క‌త‌ సందేశాన్ని వ్యాప్తి చేసినందుకు ఆయ‌న ఎన్‌టీపీసీ సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు. ఆధునిక యోగా సందేశాన్ని నగరాల నుండి గ్రామాలకు మరియు పేద, గిరిజన వర్గాల ఇళ్లకు వ్యాప్తి చేయడంలో భారత దేశం నిమగ్నమై ఉంది. యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. ఎన్‌టీపీసీ అన్‌చహార్ ఉద్యోగులు తమ ఇళ్లలో కుటుంబంతో కలిసి యోగా సంస్కృతిని చాటి చెప్పారు. 2014లో భారత ప్రభుత్వం అంత‌ర్జాతీయ యోగాదినోత్స‌వం సంద‌ర్భంగా యోగా అభ్యాసం ప్రారంభించినప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని త‌మ పూర్తి సంఘీభావంతో ఎన్‌టీపీసీ  అన్‌చహార్ సంస్థ ఈ వేడుక‌ల‌ను జరుపుకొంటుండ‌డం విశేషం. అన్నివార్గాల వారు యోగా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యుల‌య్యేలా ఈ కార్యక్రమం చాలా క్రమపద్ధతిలో నిర్వహించబడింది.


                                 

***


(Release ID: 1729093) Visitor Counter : 124