రైల్వే మంత్రిత్వ శాఖ

నగరాల‌లో క్రమంగా అన్‌లాక్ ప్రారంభమ‌వ‌డంతో కార్మికులను తిరిగి తీసుకు రావడంలో స‌హాయం చేస్తున్న రైల్వే


- గత ఏడు రోజుల్లో వలస కార్మికులు, ఇతర ప్రయాణీకులతో సహా దాదాపు 32.56 లక్షల మంది ప్రయాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన భార‌తీయ రైల్వే

- తూర్పు ఉత్త‌రప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల నుండి ఢిల్లీ, ముంబ‌యి, పూణె, సూరత్, అహ్మదాబాద్, చెన్నై ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాలకు సుదూర మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Posted On: 19 JUN 2021 4:31PM by PIB Hyderabad

కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తి కాస్త నెమ్మ‌దించ‌డంతో వివిధ ప్ర‌ధాన నగరాల్లో క్రమంగా అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో ఆయా ప్రాంతాల‌కు కార్మికులను తిరిగి తీసుకురావడానికి రైల్వే సహాయం చేస్తోంది. గ‌డిచిన 7 రోజులలో (11.6.21 నుండి 17.6.21 వరకు) వలస కార్మికులు మరియు ఇతర ప్రయాణీకులతో సహా సుమారు 32.56 లక్షల మంది ప్రయాణికులు తూర్పు ఉత్త‌రప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్‌, ఒడిశా త‌దిత‌రుల ప్రాంతాల నుంచి ఢిల్లీ, ముంబ‌యి, పూణె, సూరత్, అహ్మదాబాద్, చెన్నై ప్రాంతాలతో సహా సుదూర మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించారు (రైళ్ల సగటు ఆక్యుపెన్సీ 110.2 శాతం). బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి ముంబ‌యి, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై త‌దిత‌ర మెట్రో న‌గ‌రాల‌కు గాను వలస కార్మికులను తరలించడానికి, భారత రైల్వే మెయిల్ / ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్, హాలిడే స్పెషల్స్, సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లన్నీ కోవిడ్ ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా రిజర్వు చేసిన రైళ్లుగా సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ రైళ్ల బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్లలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా, ఈ-టికెటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో ద్వారా ప్రయాణించే ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
18.06.2021 నాటికి, 983 మెయిల్ / ఎక్స్‌ప్రెస్, హాలిడే స్పెషల్స్ (ప్రీ-కోవిడ్ స్థాయిలో 56 శాతం) ను భారత రైల్వే నిర్వహిస్తోంది. అదనంగా, పని ప్రదేశానికి తిరిగి రావాలనుకునే ప్రజల కదలికను సులభతరం చేయడానికి సుమారు 1309 సమ్మర్ స్పెషల్స్ కూడా నిర్వహించబడ్డాయి. ఈ సమ్మర్ స్పెషల్స్ ప్రధానంగా బీహార్, యుపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం వంటి వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణె, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధాన‌త‌ను అందిస్తుంది. రాబోయే 10 రోజులకు దాదాపు (19.6.21 నుండి 28.6.21 వరకు) వలస కార్మికులు మరియు ఇతర ప్రయాణీకులతో సహా సుమారు 29.15 లక్షల మంది ప్రయాణికులను తూర్పు ఉత్త‌రప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల నుంచి ఢిల్లీ, ముంబ‌యి, పూణె, సూరత్, అహ్మదాబాద్, చెన్నై ప్రాంతాలతో సహా వివిధ గమ్యస్థానాలకు సుదూర మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా బుక్ చేసుకున్నారు. జోనల్ రైల్వేలు వివిధ పరిశ్రమల సంఘాలు, వ్యాపార సంస్థలతో చురుకుగా సమన్వయం చేసుకుని డిమాండ్‌ను నిర్ధారించడానికి మరియు తదనుగుణంగా కార్మికుల కదలికను సులభతరం చేస్తాయి. దీనికి తోడు గోరఖ్‌పూర్‌-ముంబ‌యి, భాగల్పూర్-ముంబ‌యి, భువనేశ్వర్-పూణె, దానపూర్-పూణె, బరౌని-అహ్మదాబాద్, పాట్నా- ఢిల్లీ, సమస్తిపూర్-ముంబ‌యి, సీల్దా- ఢిల్లీ, రాక్సాల్- ఢిల్లీ, సహర్సా ఢిల్లీ, దానపూర్-సికింద్రాబాద్, రాక్సౌల్-సికింద్రాబాద్, పట‌లిపుత్రా-బెంగళూరు, చప్రా-ముంబ‌యి, గౌహతి-బెంగళూరు, గోరఖ్‌పూర్‌-హైదరాబాద్ మొదలైన ప్రాంతాల‌కు సమ్మర్ స్పెషల్ రైళ్లు న‌డుస్తున్నాయి.

                           

******


(Release ID: 1728764) Visitor Counter : 204