రక్షణ మంత్రిత్వ శాఖ
ఫ్లీట్ అవార్డుల వేడుక- తూర్పు నావల్ కమాండ్ కార్యాచరణ విజయాలకు గుర్తింపు
Posted On:
20 JUN 2021 12:20PM by PIB Hyderabad
గత ఏడాది తూర్పునౌకాదళ కార్యకలాపాల విజయాల వేడుకను జరుపుకునేందుకు 19 జూన్ 21న ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ 2021ను నిర్వహించారు. తూర్పు నౌకాదళ కార్యాచరణ కాలచక్ర పరిసమాప్తిని, తూర్పు నావల్ కమాడ్ (ఇఎన్‌సి) స్వోర్డ్ ఆర్మీ విజయాలను గుర్తింపు చిహ్నం ఫ్లీట్ అవార్డుల వేడుక. తూర్పు నైకాదళ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి విఎస్ఎం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎవిస్ఎం, విఎస్ఎం,ఇన్‌సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఫ్లీట్ అవార్డుల కార్యక్రమాన్ని నిరాడంబరంగా, పూర్తి స్థాయి కోవిడ్ ప్రోటోకాళ్లను అనుసరిస్తూ జరిగాయి. సముద్ర సంబంధ కార్యకలాపాల పూర్తి వర్ణపటాన్ని గుర్తిస్తూ పదహారు విశిష్ట ట్రోఫీలను అందించడంతో ఈ వేడుక పూర్తయింది. తూర్పు నౌకాదళంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉత్తమ నౌకగా గుర్తింపు పొందగా, సవాళ్ళతో కూడిన అనేక మిషన్లను చేపట్టినప్పుడు మొక్కవోని స్ఫూర్తిని, పట్టుదలను ప్రదర్శించినందుకుకాపిటల్ (యుద్ధ, విమానాలను రవాణా) నౌక ఐఎన్ఎస్ కామోర్తాను, చిన్న యుద్ధనౌకలు అటువంటి రకపు నౌకలలో ఐఎన్ నౌకలు కిల్తాన్, ఖుక్రి ఉత్తమ చిన్న యుద్ధనౌకల ట్రోఫీని గెలుచుకున్నాయి.
గడిచిని ఏడాది సన్‌రైజ్ ఫ్లీట్ కు అత్యంత సవాళ్ళతో కూడినది. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి పట్టి పీడుస్తున్నప్పటికీ, తూర్పు నౌకాదళం తన కార్యాచరణ బాధ్యతలను నిర్వహిస్తూ, అగ్రశ్రేణి క్రియాశీలక రీతిని కొనసాగించింది. అధిక కార్యాచరణ వేగాన్ని కొనసాగిస్తూ, నౌకాదళ ఓడలు అనేక ఆపరేషన్లు, విన్యాసాలు, మానవీయ సహాయ మిషన్లలో పాల్గొన్నాయి. తూర్పు నౌకాదళ ఓడలు మలబార్ -20, లా పెరౌజ్, పాసెక్స్ వంటి పలు ప్రధాన ద్వైపాక్షిక, బహుళపాక్షిక విన్యాసాలలో వివిధ నావికాదళాలతో కలిసి పాల్గొని, హెచ్ఎడిఆర్ స్టోర్స్ బట్వాడాకు ఆపరేషన్ సహాయం, మిషన్ సాగర్ లను, విదేశాలలో చిక్కకుపోయిన బారతీయ పౌరులను రక్షిత స్థానాలకు తరలించేందుకు ఆపరేషన్ సముద్ర సేతను నిర్వహించింది. కోవిడ్-19 రెండవ వేవ్‌లో ఆపరేషన్ సముద్ర సేతు IIలో భాగంగా తాము వృత్తిపరమైన, విశ్వసనీయ శక్తి అని నొక్కి చెప్తూ తూర్పు నావికాదళ ఓడలు తూర్పు సముద్ర తీరంలో ఆక్సిజన్ బట్వాడాను పెంచేందుకు ప్రధానమైన మాధ్యమంగా వ్యవహరించి,
***
(Release ID: 1728763)
Visitor Counter : 201