హోం మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పారదర్శకతతో అభివృద్ధిని తీసుకురావడానికి, జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా



జమ్మూ-కశ్మీర్ ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమమే, మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం : అమిత్ షా


జమ్మూ-కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు 90 శాతం చేరుకోవడాన్ని ప్రశంసించిన - కేంద్ర హోంమంత్రి


కోవిడ్-19 టీకాలు జమ్మూ-కశ్మీర్‌లో 76 శాతం, నాలుగు జిల్లాల్లో 100 శాతం మేర పూర్తి అయినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఆయన బృందాన్ని అభినందించిన - శ్రీ అమిత్ షా


పి.ఓ.జె.కే., పశ్చిమ పాకిస్తాన్ నుండీ, అలాగే కశ్మీర్ నుండీ, జమ్మూకు వచ్చిన శరణార్థులందరూ వీలైనంత త్వరగా శరణార్థుల ప్యాకేజీ ప్రయోజనాలను పొందనున్నారు


ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టు లతో సహా అనేక ఇతర అభివృద్ధి పథకాలు కూడా వేగంగా పూర్తి కానున్నాయి


3,000 మెగావాట్ల పాకల్ దుల్ మరియు కీరు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టు లతో పాటు 3,300 మెగావాట్ల ఇతర ప్రాజెక్టులను కూడా వేగంగా ప్రారంభించడానికి ఆదేశాలు జారీ

కొత్త పంచాయతీ సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలి; వారు దేశవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీలను సందర్శించాలి



రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయంలో ఆధునిక పద్

Posted On: 18 JUN 2021 7:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన "పారదర్శకతతో అభివృద్ధి" అనే లక్ష్య సాధన దిశగా, జమ్మూ-కశ్మీర్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టు ల పురోగతిని, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఈ రోజు, న్యూ ఢిల్లీ లో సమీక్షించారు.  జమ్మూ-కశ్మీర్ ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమం మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రధానం అని శ్రీ షా పేర్కొన్నారు.  జమ్మూ-కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు 90 శాతం మంది ప్రజలకు చేరుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు.  కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం జమ్మూ-కశ్మీర్‌ లో 76 శాతం, నాలుగు జిల్లాల్లో 100 శాతం చొప్పున అమలు చేసినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మరియు అతని బృందాన్ని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా అభినందించారు.

ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ, ఫ్లాగ్-షిప్, ఐకానిక్, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసినందుకు హోంమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  పశ్చిమ పాకిస్తాన్, పి.ఓ.జె.కే, నుండి వచ్చిన శరణార్థులతో పాటు, కశ్మీర్ నుండి జమ్మూకు వచ్చే వలసదారులు అందరికీ, శరణార్థుల ప్యాకేజీ కింద ప్రయోజనాలను త్వరగా అందించాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు.

ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులతో సహా అనేక ఇతర అభివృద్ధి పథకాలను వేగంగా పూర్తి చేయాలని శ్రీ అమిత్ షా కోరారు.  3,000 మెగావాట్ల పాకల్ దుల్ మరియు కిరు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టులతో పాటు, 3,300 మెగావాట్ల ఇతర ప్రాజెక్టులను కూడా వేగంగా ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.

పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల బలోపేతం కోసం, సభ్యులకు వెంటనే శిక్షణ ఇవ్వాలని, శ్రీ అమిత్ షా అధికారులను ఆదేశించారు.  వారు కూర్చోడానికి సరైన ఏర్పాట్లు చేయాలనీ, ఈ సంస్థలు సజావుగా పని చేయడానికి వీలుగా సిబ్బందికి పరికరాలు, ఇతర వనరులను అందించాలనీ, ఆయన ఆదేశించారు.  దీనితో పాటుదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాలని, పంచాయతీ సభ్యులను, ఆయన ఆదేశించారు.  తద్వారా, దేశంలోని అభివృద్ధి చెందిన వివిధ పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయో, సమాచారం తెలుసుకునే అవకాశం, వారికికలుగుతుందని, ఆయన తెలియజేశారు.

ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి వీలుగాఎం.జి.ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎ. పరిధిని పెంచవలసిన ఆవశ్యకతను, కేంద్ర హోం మంత్రి నొక్కి చెప్పారు.  అదే సమయంలో, రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించ వలసిన అవసరం గురించిప్రతి జిల్లాలో కనీసం ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయడం గురించి, కూడా ఆయన  మాట్లాడారు.  జమ్మూ-కశ్మీర్‌లో ఆపిల్ ఉత్పత్తిలో  నాణ్యత మరియు సాంద్రతలను పెంచేందుకు కృషి చేయాలని కూడా, ఆయన సూచించారు.  తద్వారాఆపిల్ పండించే రైతులు, తమ పంటకు గరిష్ట ధరను అందుకుంటారు.

ఏటా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 6,000 రూపాయలు జమ చేసే ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ యోజన వంటి, రైతులకోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు, రైతులందరికీ అందేలా చూడాలనిజమ్మూ-కశ్మీర్ కు చెందిన పాలనా యంత్రాంగాన్నికేంద్ర హోంమంత్రి, ఆదేశించారు.

పారిశ్రామిక విధానం యొక్క ప్రయోజనాలు చిన్న తరహా పరిశ్రమలకు చేరేలా చూడాలని కూడా కేంద్ర హోంమంత్రి కోరారు. యువతకు ఉపాధి కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలనుపబ్లిక్-డొమైన్ లో ఉంచిన అన్ని అభివృద్ధి పనుల జియో-ట్యాగింగ్ చేయడం, ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జి.ఈ.ఎమ్) ద్వారా కొనుగోలు చేయడంగ్రామ స్వరాజ్, సామాజిక భద్రత తో పాటు, ఇతర వ్యక్తిగత లబ్ధిదారుల పథకాలకు చెందిన దాదాపు వంద శాతం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయడంవంటి సంస్థాగత సంస్కరణలను, కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు.

ఈ సమావేశంలో - జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ మనోజ్ సిన్హా తో పాటు, కేంద్ర ప్రభుత్వం మరియు జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1728422) Visitor Counter : 215