ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం క్రౌడ్-ఫండింగ్ ద్వారా స్వచ్ఛంద నిధుల సేకరణ, క్షయ వ్యాధి నిర్మూలపై కార్పొరేట్ సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినడాక్టర్ హర్షవర్ధన్
ప్రపంచంలో అందరికంటే అయిదు సంవత్సరాలు ముందుగా దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆశయాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం - డాక్టర్ హర్షవర్ధన్
పోలియో తరహాలో దేశంలో త్వరితగతిన క్షయ వ్యాధి నిర్మూలన జరగాలన్న డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
17 JUN 2021 5:36PM by PIB Hyderabad
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం క్రౌడ్-ఫండింగ్ ద్వారా స్వచ్ఛంద నిధుల సేకరణ, క్షయ వ్యాధి నిర్మూలపై దిగ్గజ వ్యాపార సంస్థలు ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
మానవతా దృక్పధంతో ప్రైవేట్ రంగ సహకారంతో ఆపదలో ఉన్న వారిని ఏవిధంగా ఆడుకోవచ్చునన్న అంశాన్ని చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్-19 రెండవ దశను సమర్ధంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సహకరించిన ప్రభుత్వరంగ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఈ విషయంలో ప్రైవేట్ రంగ సంస్థలు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రాడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రైవేట్ రంగ సంస్థలు ముందుకు రావలసిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి, అరుదైన వ్యాధులతో బాధపడుతున్నవారి చికిత్సకు ఎదురవున్న నిధుల సమస్యలను పరిష్కరించడానికి ప్రైవేట్ రంగ సంస్థలు మానవతా దృక్పధంతో ముందుకు రావాలని ఆయన కోరారు. సంస్థలు చేపడుతున్న సీఎస్ఆర్ కార్యక్రమాల కింద ఈ నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు.
ప్రపంచంలో 8%మంది అత్యంత అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పిన మంత్రి వీరిలో 75% పిల్లలు వుంటున్నారని వివరించారు. చికిత్సకు అవసరమయ్యే నిధుల కోసం పిల్లల తల్లితండ్రులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ క్రమంలో వారు ఆర్ధికంగా మానసికంగా కుంగిపోతున్నారని మంత్రి అన్నారు.
అరుదైన వ్యాధులకు దేశంలోనే చికిత్స అందించడానికి ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నదని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అరుదైన వ్యాధులపై ఒక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు చికిత్సకు నిధులను సమకూర్చడానికి గుర్తించిన ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో ఖాతాలను తెరిచామని మంత్రి వివరించారు. తక్కువ ఖర్చుతో అరుదైన వ్యాధులకు చికిత్స అందించి, ఔషధ ఉత్పత్తికి పరిశోధనా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఐసీఎంఆర్, డీబీటీ, సీఎస్ఆర్ఐ ల సహకారంతో పరిశోధనలను చేపట్టడానికి సంస్థను ఏర్పాటు చేశామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. అరుదైన వ్యాధుల నిర్ధారణ కోసం సీఎస్ఆర్ఐ ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తున్నదని అన్నారు. అరుదైన వ్యాధులకు చికిత్స అందించడానికి మందులను అభివృద్ధి చేసే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.
చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఔషదాలకు కస్టమ్ సుంకం తగ్గించే అంశాన్ని ఆర్ధిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నదని అన్నారు.
అరుదైన వ్యాధులతో వ్యాధులతో బాధ పడుతున్న వారికి చికిత్స అందించడానికి నిధులను సమీకరించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ పోర్టల్ ఫర్ క్రౌడ్ ఫండింగ్ ను నెలకొల్పిందని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. వ్యక్తులు, సంస్థలు దీనిద్వారా అరుదైన వ్యాధులకు చికిత్స అందించడానికి, వారిని సంరక్షించడానికి నిధులను విరాళంగా ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటుకావడం ఇదే తొలిసారని మంత్రి అన్నారు. అరుదైన వ్యాధులపై పరిశోధనలను చేపట్టడానికి లేదా అరుదైన వ్యాధి కలిగిన పిల్లలను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు నిధులను సమకూర్చడానికి ముందుకు రావాలని మంత్రి పిలుపు ఇచ్చారు.
ఖచ్చితమైన టిబి స్క్రీనింగ్ మరియు డయాగ్నొస్టిక్ సాధనాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి, కృత్రిమ మేధస్సుతో తో కూడిన డిజిటల్ ఎక్స్‌రే, నాట్ వినియోగం వల్ల దేశంలో టిబి కేసులను సకాలంలో గుర్తించడానికి వీలవుతున్నదని మంత్రి అన్నారు. అధిక నాణ్యత గల మందులు, డిజిటల్ టెక్నాలజీస్, సామాజిక సౌకర్యాలతో టిబి చికిత్స అందిస్తున్నామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దీనితో దేశంలో టిబి కేసులు, మరణాల వేగంగా తగ్గుతున్నాయని అన్నారు. ఎస్డిజి లక్ష్యం కంటే ఐదేళ్ళు ముందుగానే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నిర్దేశించిన విధంగా 2025 చివరకిదేశంలో టీబీ ని నిర్మూలించడానికి కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి వివరించారు.
పోలియో మాదిరిగానే 2025 నాటికి టిబిని నిర్మూలించాలని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. పోలియోవ్యాధులను నిర్మూలించడానికి ప్రజలు, నాయకులు, పరిశ్రమలు కలసి సంయుక్తంగా పనిచేయవలసి ఉంటుందని అన్న డాక్టర్ హర్షవర్ధన్ పోలియో నిర్మూలనలో తన అనుభవాలను వివరించారు. పోలియో నిర్మూలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి సంస్థలపూర్తి సహకారాన్ని అందించాయని అన్నారు. 2025 నాటికి టిబినుంచి భారతదేశం విముక్తి పొందాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కల నెరవేర్చడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. ప్రతి నెల 24 వ తేదీన టిబి నిర్మూలనలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సంబంధిత తానూ వ్యక్తిగతంగా సమీక్షిస్తారని ఆయన అన్నారు.
సమావేశంలో వివిధ రంగాలకు చెంది వ్యక్తులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ హర్షవర్ధన్ 2025 నాటికి భారతదేశంలో టీబీని నిర్మూలించడానికి ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ రాజేష్ భూషణ్, కార్యదర్శి (హెచ్‌ఎఫ్‌డబ్ల్యు), శ్రీమతి ఆర్తి అహుజా, అదనపు కార్యదర్శి (హెచ్), శ్రీమతి రేఖ శుక్లా,సంయుక్త కార్యదర్శి , మరియు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ వ్యవహారాల కింద పిఎస్‌యుల ప్రతినిధులు మరియు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒఎన్‌జిసి, గెయిల్), బొగ్గు మంత్రిత్వ శాఖ (కోల్ ఇండియా , నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్), విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎన్టిపిసి, ఎన్‌హెచ్‌పిసి, విద్యుత్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ (సెయిల్), రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ సంస్థల శాఖ, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (మజాగాన్ డాక్స్ షిప్బిల్డర్లు, గోవా షిప్‌యార్డ్) మరియు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుదైన వ్యాధుల కోసం నోటిఫై చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధులు, సిఐఐ, ఫిక్కీ, అసోచామ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
****
(Release ID: 1728059)
Visitor Counter : 144