వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ధ్రువీకరణ కలిగిన జల్గావ్ అరటి దుబాయికి ఎగుమతి చేయబడింది.
2020–21 మధ్యకాలంలో రూ.619 కోట్ల విలువచేసే 1.91 లక్షల టన్నుల అరటిని భారతదేశం ఎగుమతి చేసింది.
प्रविष्टि तिथि:
16 JUN 2021 11:22AM by PIB Hyderabad
జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ధ్రువీకరణ పొందిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకంగా ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉన్నజల్గావ్ అరటిపండ్లను దుబాయికి ఎగుమతి చేశారు.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోగల తాండల్వాడి గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతుల నుంచి ఇరవై రెండు మెట్రిక్ టన్నుల జియోగ్రాఫికల్ ధ్రువీకరణ కలిగిన జల్గావ్ అరటిని వ్యవసాయ ఎగుమతి విధానం కింద గుర్తించారు.
2016 లో జల్గావ్ అరటికి జియోగ్రాఫికల్ ధ్రువీకరణ లభించింది. జల్గావ్లోని నిసర్గరాజ కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఇది నమోదు చేయబడింది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంభించడం వల్ల భారతదేశం యొక్క అరటి ఎగుమతి వేగంగా పెరుగుతోంది.
భారతదేశం 2018–19లో రూ.413కోట్లు విలువచేసే 1.34లక్షల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేయగా.. 2019–20 నాటికి రూ.660కోట్లు విలువ చేసే 1.95మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2020–21వ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు రూ.619 కోట్లు విలువ చేసే 1.91 లక్షల మెట్రిక్ టన్నుల అరటిని భారత్ ఎగుమతి చేసింది.
అరటి ఉత్పత్తుల్లో 25 శాతం వాటాతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశం అరటి ఉత్పత్తిలో 70శాతానికిపైగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతోంది.
వ్యవసాయ ఉత్పత్తులకు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ఏపీఈడీఏ ప్రోత్సహిస్తోంది. మౌలిక వసతులు అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల అభివృద్ధి, మార్కెటింగ్ అభివృద్ధి పథకాల ద్వారా ఎగుమతులకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి దిగుమతి చేసుకునే దేశాలతో, అంతర్జాతీయ కొనుగోలుదారులు, అమ్మకందారులతో వర్చువల్ వాణిజ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇవే కాకుండా వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పన, మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ వంటి పథకాల ద్వారా వాణిజ్యశాఖ కూడా వాణిజ్య శాఖ కూడా ఎగుమతులను ప్రోత్సహిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1727699)
आगंतुक पटल : 242