వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వైట్‌గూడ్స్‌పై పీఎల్ఐ ప‌థ‌కం గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారితో చ‌ర్చించిన‌ కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్


ఈ స‌రికొత్త పథకం కింద అర్హత కలిగిన సంస్థల ఎంపిక పారదర్శకంగానూ.. సమయానుసారంగా జరుగుతుందని వెల్ల‌డించిన కేంద్ర మంత్రి

Posted On: 14 JUN 2021 7:36PM by PIB Hyderabad

వైట్‌గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ) పై ఇండస్ట్రీ ఆన్ ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) గురించి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖల‌ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప‌రిశ్ర‌మ‌ల వ‌ర్గాల వారితో ఈ రోజు ముచ్చ‌టించారు. ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తుల‌ను తీసుకొనే ప్ర‌క్రియ రేప‌టి నుంచి మూడు నెల‌ల పాటుగా తెరిచి ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో పథకంపై అభిప్రాయాల‌ను తెలుసుకోవడానికి గాను కేంద్ర మంత్రి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారితో ముచ్చ‌టించారు. కీలకమైన 13 రంగాలకు 2021-22 బడ్జెట్‌లో పీఎల్‌ఐ పథకాలకు రూ.1.97 లక్షల కోట్ల నిధుల‌ను ప్రకటించారు. పీఎల్ఐ ద్వారా ఐదు సంవత్సరాల్లో కనీసం 500 బిలియ‌న్ డాల‌ర్ల ఉత్పత్తి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌గ‌ల‌మ‌ని అంచనా. పీఎల్ఐ మాత్రమే రానున్న‌ ఐదు  సంవత్సరాలలో మొత్తం ఉత్పాదక ఉత్పత్తిలో 1/4వ భాగాన్ని విస్తరించగలదు. రానున్న 5 సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా క‌నీసంగా కోటి మందికి ఉపాధి ల‌భించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా. వైట్‌గూడ్స్‌పై పీఎల్ఐ ప‌థకం ఏప్రిల్ 16న తెలియజేయబడింది. భారతదేశంలో వైట్ గూడ్స్ తయారీదారుల కోసం ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకం యొక్క‌ స్కీమ్ మార్గదర్శకాలు 2021 జూన్ 4 న జారీ చేయబడ్డాయి. ఈ పథకానికి 2021-22 నుండి 2028-29 వరకు రూ.6,238 కోట్ల మేర అవుట్‌లే క‌ల‌దు. దీని ద్వారా ఐదు సంవత్సరాల పాటు.. పెరుగుతున్న అమ్మకాలపై 4 శాతం నుండి 6 శాతం ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
భార‌త్ స‌త్తాను చాటుతుంది..
పరిశ్రమల అధినేత‌ల‌ను ఉద్దేశించి మంత్రి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో తయారీ ఛాంపియన్లను త‌యారు చేయడానికి ఈ వినూత్న పథకం ప్రవేశపెట్టిన‌ట్టుగా తెలిపారు. రానున్న రోజుల్లో భార‌త‌ వృద్ధి క‌థ‌ను ప్రధానంగా పీఎల్‌ఐ పథకం నాయకత్వం వహిస్తుందని ఆయన అన్నారు. ఈ ప‌థ‌కం ఖర్చు - పోటీతత్వం, నాణ్యత, సమర్థత, మేటి సాంకేతికత‌ల‌ను అందుబాటులోకి.. తీసుకు వ‌స్తుంది. ప్ర‌పంచ సప్లై చెయిన్ల అవ‌నిక‌పై భార‌త‌దేశం తమ వాదన‌ల్ని చాటుకునేందుకు పీఎల్ఐ ఉప‌యోగ‌ప‌డుతుంది.. త‌ద్వారా పోటీ, తులనాత్మక ప్రయోజనాల‌ను పీఎల్ఐ పెంపొందిస్తుంద‌ని మంత్రి చెప్పారు. ఈ పథకం సామర్థ్యం మరియు స‌త్తాను సృష్టించేందుకు భారతీయ తయారీని ఇది రీబూట్ చేస్తుంది అని అన్నారు. ఈ పథకం కింద అర్హత క‌లిగిన సంస్థల ఎంపికను పారదర్శకంగాను, సమయానుసారంగా జరుగుతుందని శ్రీ గోయల్ తెలిపారు.
                               

*****



(Release ID: 1727121) Visitor Counter : 141