అంతరిక్ష విభాగం

ఈ ఏడాది అక్టోబర్‌లో దుబాయ్‌లో జరగబోయే వరల్డ్ ఎగ్జిబిషన్లో భారత అంతరిక్ష శక్తి అన్ని కోణాల్లో ప్రదర్శిస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు


ప్రధాని మోడీ ‘న్యూ ఇండియా టు వరల్డ్‌’ను ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్ ఒక ప్రత్యేకమైన అవకాశమని చెప్పారు

Posted On: 14 JUN 2021 5:19PM by PIB Hyderabad

ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధఙ (డోఓఎన్ఈఆర్) మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్),   పిఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి  అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మోడీ  ప్రవచిత న్యూ ఇండియాకు మన అంతరిక్ష పరాక్రమంతో గుర్తింపు వచ్చిందని అన్నారు.  ప్రపంచ దేశాల కూటమి సరసన భారత్కు అగ్రస్థానం దక్కిందని అన్నారు.

 

దుబాయ్‌లో జరగబోయే వరల్డ్ ఎగ్జిబిషన్ గురించి ప్రభుత్వ సీనియర్ అధికారులు,  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ) సభ్యులు ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించారు. భారత అంతరిక్ష విజయాలను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన ప్లాట్ను కేటాయించినట్టు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో),  అంతరిక్ష శాఖల మంత్రి సింగ్ మాట్లాడుతూ, అంతరిక్ష రంగంలో భారతదేశం సత్తా చూపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రను సృష్టించారని ప్రశంసించారు. ఆయన దీర్ఘదృష్టి, నైపుణ్యం, సామర్థ్యాల వల్ల దేశాన్ని స్వయంప్రతిపత్తిగా మార్చడానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, మనదేశ విజయగాథను వినిపించడం ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిని ఇవ్వవచ్చని అన్నారు. వారి భవిష్యత్ అంతరిక్ష సాంకేతిక సంబంధిత   ప్రాజెక్టులను విజయవంతం చేయడంపై సూచనలను కూడా అందించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని ప్రపంచ కూటమిలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని సింగ్ అన్నారు. అంతరిక్ష సామర్థ్యాలలో సాధించిన ఆధిపత్యం ద్వారా భారతదేశం పైకి ఎదగడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.  ఇస్రో చేపట్టిన చంద్రయాన్, మార్స్ మిషన్ , త్వరలో రాబోయే గగన్ యాప్ గురించి ప్రపంచమంతటా ఆసక్తి నెలకొందని చెప్పారు.

అంతరక్షి రంగం కోసం జాతీయ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి భారత్ సప్లై, డిమాండ్  డిమాండ్ ఆధారిత మోడల్‌ను ఎంచుకుంటుందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో మనకు ఉన్న సత్తాను, నైపుణ్యాలను ఉపయోగించుకుంటుందని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి), అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్షంలో కొత్త సరిహద్దులు దాటడం, అంతరిక్ష అన్వేషణ, భవిష్యత్ తరం  సామర్థ్యాన్ని ఆకర్షించడానికి  మానవ అంతరిక్ష విమానం తయారీపై దృష్టి పెడుతుందని చెప్పారు. ‘‘అంతరిక్షరంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కోసం ప్రధానమంత్రి తలుపులు తెరిచారు. ఆయన ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల అంతరిక్ష మార్కెట్‌లో మనదేశం పోటీ పడగలుగుతుంది. అంతరిక్ష కార్యక్రమాల  ప్రయోజనాలను పేదలకు చేరేలా చేస్తుంది.

 

మోడీ ప్రభుత్వ హయాంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలను గత ఏడు సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వివిధ రంగాలకు విస్తరించారు. ఇవి సాధారణ పౌరులకు జీవన సౌలభ్యాన్ని తీసుకువచ్చాయి. అంతరిక్ష,  ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాలను రైల్వేలు, రోడ్డు, బ్రిడ్జిల నిర్మాణం, వ్యవసాయ రంగం, హౌసింగ్, టెలి-మెడిసిన్, విపత్తు నిర్వహణలో వాడుతున్నారు. ఉపగ్రహాల వల్ల  ఖచ్చితమైన వాతావరణ సూచనలు అందుతున్నాయి”అని సింగ్ వివరించారు.

ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ఇప్పటికే యాక్ట్ ఈస్ట్ ప్రయాణాన్ని ప్రారంభించినందున, నార్త్ ఈస్ట్ పెవిలియన్ ను కూడా ప్రపంచానికి చూపిస్తామని ఎన్ఈఆర్ డెవెలప్మెంట్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రభుత్వం వెదురు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహం వల్ల  ప్రపంచం ఆకుపచ్చగా మారుతుందని ఆయన అన్నారు. అపార అవకాశాలకు  భారతదేశం నెలవు అనే విషయాన్ని ఈ ఎగ్జిబిషన్ ద్వారా వివరిస్తామని తెలిపారు. అంతరిక్షంతోపాటు ఫార్మా, రత్నాలు,  ఆభరణాలు, స్టార్టప్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, పురాతన వారసత్వ,  సంస్కృతి వంటి రంగాలలో నాయకత్వ పాత్రను ప్రపంచానికి చూపిస్తామని అన్నారు.

దుబాయ్‌లో వరల్డ్ ఎగ్జిబిషన్ 2021 అక్టోబర్ 1 నుండి 2022 మార్చి 31 వరకు జరుగుతుంది. భారతదేశ 75 వ స్వాతంత్ర్య వేడుకలతో సమానంగా వీటిని నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్లో 192 దేశాలు పాల్గొంటాయి.  “కనెక్ట్ మైండ్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్” పేరుతో స్పేస్ టెక్నాలజీతో సహా 11 థీమ్‌లను భారత్ ప్రదర్శిస్తుంది

 

***


(Release ID: 1727089) Visitor Counter : 225