శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వైరల్ నిరోధకశక్తి కలిగిన 3డి ప్రింటెడ్ మాస్క్ ను అభివృద్ధి చేసిన పుణె సంస్థ


ఎన్ 95, 3 ప్లై, కాటన్ మాస్కుల కంటే తమ మాస్క్ సమర్ధంగా పనిచేస్తుందని తెలిపిన థింకర్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్

Posted On: 14 JUN 2021 11:39AM by PIB Hyderabad

పూణే కేంద్రంగా పనిచేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర సంస్థగా ఏర్పాటైనథింకర్ టెక్నాలజీస్ ఇండియా కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్కుల తయారీపై పరిశోధనలను సాగించి వినూత్నంగా 3డి మాస్కులను అభివృద్ధిచేసింది. కోవిడ్-19 నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  కార్యక్రమాల్లో భాగంగా థింకర్ టెక్నాలజీస్ ఇండియా అభివృద్ధి చేసిన మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఎంపిక చేసింది. 

 

కోవిడ్-19ని సమర్ధంగా ఎదుర్కోవడానికి వినూత్న విధానాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ 2020 మేలో పరిశోధనలను చేపట్టడానికి థింకర్ టెక్నాలజీస్ ఇండియాకి నిధులను సమకూర్చింది. మాస్కుల అభివృద్ధిపై 2020 జులై 8న థింకర్ టెక్నాలజీస్ ఇండియా ఒప్పందంపై సంతకం చేసింది. సాధారణ ఎన్ 95, 3ప్లే, కాటన్ మాస్కులతో పోల్చి చూస్తే తాము అభివృద్ధి చేసిన మాస్క్ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే అంశంలో మరింత సమర్ధంగా పనిచేస్తుందని థింకర్ టెక్నాలజీస్ ఇండియా పేర్కొంది. 

నాణ్యత కలిగిన మాస్కుల ఆవశ్యకత 

ఔషధాలపై పరిశోధనలను సాగిస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా వివిధ ఔషధాల తయారీ వాటిలో వుండే  తంతువులను కనుగొనటానికి ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్ (ఎఫ్డిఎమ్) 3 డి-ప్రింటర్ల అభివృద్ధిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ' కోవిడ్ సమస్య తొలిసారి ఎదురైన సమయంలోనే మేము దీని ప్రాధాన్యతను ప్రమాదాన్ని గుర్తించాం. ఇన్ఫెక్షన్ నివారణకు మాస్కుల వినియోగం తప్పనిసరి అవుతుందని తెలుసుకున్నాము. ప్రపంచవ్యాపితంగా మాస్కుల వినియోగం పెరుగుతుందని అంచనా వేసాము. అయితేలభించడం మాస్కుల నాణ్యత తక్కువగా వుంది. ఇళ్లలో తయారవుతున్న మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ వీటి నుంచి సరైన రక్షణ లేదు. దీనిని గుర్తించి ఇన్ఫెక్షన్ నివారణకు మరింత సమర్ధంగా పనిచేసే మాస్కుల రూపకల్పన దృష్టి సారించి పనిచేసి విజయం సాధించి  3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును అభివృద్ధి చేసాంఅని థింకర్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ షితాల్‌కుమార్ జాంబాడ్ వివరించారు. 

రూపకల్పన దిశగా ప్రయాణం 

అధిక నాణ్యత కలిగిన మాస్కులను అభివృద్ధికి  నెరుల్‌లో ఉన్న మెర్క్ లైఫ్ సైన్సెస్ సంస్థ సహకారంతో థింకర్ టెక్నాలజీస్ పరిశోధనా కార్యక్రమాలను చేపట్టింది. మాస్కులను తయారు చేయడానికి నూలుతో చేసిన మాస్కులపై 3డి ప్రింటింగ్ సాంకేతికతను సంస్థ అభివృద్ధి చేసింది. ఔషధ మిశ్రమాలను మాస్కుపై పై పూతగా చేర్చి వినూత్నంగా మాస్క్ ను సంస్థ అభివృద్ధి చేసింది. ఎన్ 95, 3ప్లై, కాటన్ మాస్కులపై దీనిని ఉపయోగిస్తూ తిరిగి వినియోగించడానికి వీలుగా వుండే ఫిల్టర్లను అమర్చి థింకర్ టెక్నాలజీస్ మాస్కులను అభివృద్ధి చేసింది. వడపోత సూత్రంతో పనిచేసే ఈ మాస్కులు వైరస్ నుంచి అదనపు రక్షణను అందిస్తాయి. 

 

సార్స్ కోవ్ 2 వైరస్ ను మీ మాస్కులు సమర్ధంగా నిర్వీర్యం చేస్తున్నాయని పరీక్షల్లో వెల్లడయ్యింది. మాస్కుపై పై పూతగా వేయడానికి సోడియం ఒలేఫిన్ సల్ఫోనేట్ ఆధారిత మిశ్రమాన్ని వినియోగించారు.  హైడ్రోఫిలిక్ మరియు హైడ్రోఫోబిక్ లక్షణాలతో ఇది ఒకవిధంగా సబ్బుగా పనిచేస్తుంది. వైరస్ క్రిములను ఇది పారదోలుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలో కూడా సమర్ధంగా పనిచేసే ఈ మిశ్రమాన్ని సౌందర్య సాధనాల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

 

తిరిగి ఉపయోగించడానికి వీలుగా వుండే ఈ మాస్కులు బాక్టీరియా ను 95%వరకు నిరోదిస్తున్నాయని పరీక్షల్లో వెల్లడయ్యిందని డాక్టర్ జాంబాద్ తెలిపారు. 

తాము అభివృద్ధి చేసిన మాస్కులకు తమకు పేటెంట్ హక్కులను ఇవ్వాలని కోరుతూ థింకర్ టెక్నాలజీస్ ఇండియా దరఖాస్తు చేసింది. వాణిజ్య అవసరాల కోసం వీటి ఉత్పత్తిని ప్రారంభించారు. నందూర్‌బార్నాసిక్ మరియు బెంగళూరులోని నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల ఆరోగ్య సంరక్షణ కార్మికుల ఉపయోగం కోసం మరియు బెంగళూరులోని ఒక బాలికల పాఠశాల మరియు కళాశాలకు ఒక స్వచ్చంధ సంస్థ సహకారంతో 6,000 మాస్కులను  థింకర్ టెక్నాలజీస్ ఇండియా పంపిణీ చేసింది.

***



(Release ID: 1726969) Visitor Counter : 244