రక్షణ మంత్రిత్వ శాఖ
ఐడెక్స్- డిఐఓ ద్వారా రక్షణ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేందుకు రూ.498.8 కోట్ల బడ్జెట్ కు ఆమోదముద్ర వేసిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్
Posted On:
13 JUN 2021 10:39AM by PIB Hyderabad
వచ్చే 5 ఏళ్ళల్లో ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్సె ఎక్సలెన్స్ (ఐడెక్స్) - డిఫెన్సె ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డిఐఓ) కి రూ.498.8 కోట్ల బడ్జెట్ సహాయానికి రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఆమోదించారు. దేశంలోని రక్షణ మరియు ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన, స్వదేశీకరణ ప్రాధమిక లక్ష్యంగా ఐడెక్స్- డిఐఓ ఉంటుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 'ఆత్మనిర్భర భారత్' సంకల్పానికి ప్రతిరూపంగా ఇది ఆవిష్కృతమవుతుంది.
రక్షణ ఉత్పత్తి విభాగం (డిడిపి) ఐడెక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం మరియు డిఎస్‌ఓను స్థాపించడం వెనుక ఉద్దేశం... ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌లు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, ఆర్‌అండ్‌డితో సహా పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం. తద్వారా రక్షణ, ఏరోస్పేస్‌లో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి తగు పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. అలాగే పరిశోధన, అభివృద్ధి సంస్థలు, భారత రక్షణ, ఏరోస్పేస్ అవసరాలకు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆర్ అండ్ డి అభివృద్ధిని నిర్వహించడానికి వారికి గ్రాంట్లు / నిధులు, ఇతర సహాయాన్ని అందిస్తాయి.
రాబోయే ఐదేళ్ళకు రూ. 498.8 కోట్ల బడ్జెట్ మద్దతుతో ఈ పథకం, డిఓఓ చట్రం లో దాదాపు 300 స్టార్టప్‌లు / ఎంఎస్‌ఎంఇలు / వ్యక్తిగత ఆవిష్కర్తలు, 20 భాగస్వామి ఇంక్యుబేటర్లకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యం. ఇది రక్షణ అవసరాల గురించి భారతీయ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో పెరిగిన అవగాహనకు తోడ్పడుతుంది.
డిఐఓ, తన బృందంతో, భారత రక్షణ ఉత్పత్తి పరిశ్రమతో పరస్పర సంప్రదింపులు చేసుకోడానికి ఆవిష్కర్తల కోసం ఛానెల్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ గ్రూపు దీర్ఘకాలిక ప్రభావం చూపేలా ఒక ప్రభావవంతమైన విధానాన్ని నెలకొల్పాలి. భారతీయ సైన్యం ఆవిష్కర్తల ప్రయత్నాలను నమోదు చేయాలి.
భారతీయ రక్షణ మరియు ఏరోస్పేస్ రంగానికి తక్కువ, కాలక్రమంలో వారి అవసరాలను తీర్చడానికి కొత్త, స్వదేశీ మరియు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యంగా ఉంది; రక్షణ మరియు ఏరోస్పేస్ కోసం సహ-ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వినూత్న స్టార్టప్‌లతో కలిసి తగు పరిస్థితులు నెలకొల్పడం; రక్షణ మరియు ఏరోస్పేస్ రంగంలో సాంకేతిక సహ-ఆవిష్కరణల, సంస్కృతిని శక్తివంతం చేసి స్టార్టప్‌లలో ఆవిష్కరణను పెంచుతుంది.
భాగస్వామి ఇంక్యుబేటర్స్ (పిఐలు) రూపంలో ఐడెక్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి డిడిపి డిఓఓకు నిధులను విడుదల చేస్తుంది; రక్షణ మరియు ఏరోస్పేస్ అవసరాలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పిఐ లతో ఎంఎస్ఎంఈల ఆవిష్కర్తలు / స్టార్ట్-అప్స్ / టెక్నాలజీ సెంటర్లతో కమ్యూనికేట్ చేయడం; సంభావ్య సాంకేతికతలు, ఎంటిటీలను షార్ట్‌లిస్ట్ చేయడానికి వివిధ సవాళ్లు / హ్యాక్‌థాన్‌లను నిర్వహించడం మరియు ఆవిష్కరణలు / స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన సాంకేతికతలు మరియు ఉత్పత్తులను వాటి ప్రయోజనం మరియు రక్షణ మరియు ఏరోస్పేస్ వ్యవస్థపై ప్రభావం పరంగా అంచనా వేయడం. ఇతర కార్యకలాపాలలో ప్రయోజనం కోసం అంకితమైన ఆవిష్కరణ నిధులను ఉపయోగించి పైలట్‌లను ప్రారంభించడం, నిధులు ఇవ్వడం; ఇలా డీడీపీ విడుదల చేసే నిధులు వినియోగిస్తారు.
****
(Release ID: 1726824)
Visitor Counter : 231