ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ అప్‌డేట్ -19
प्रविष्टि तिथि:
13 JUN 2021 9:18AM by PIB Hyderabad
ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ 10,26,159కు తగ్గింది.
యాక్టివ్ కేసులు గత 24 గంటలలో 54,531 తగ్గాయి
ఇండియాలో కోవిడ్ కేసులు 71 రోజుల అనంతరం కనిష్ఠానికి చేరుకున్నాయి.
దేశఃలో కొత్త కోవిడ్ కేసులు 80,834 నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,80,43,446 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 1,32, 062 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
వరుసగా 31 వ రోజు కూడా కోవిడ్ కొత్త కేసుల కన్న , కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకున్నవారి రేటు 95.26 శాతానికి చేరింది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తగ్గింది. ప్రస్తుతం అది 4.74 శాతం గా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 4.25 శాతం . వరుసగా 20 వ రోజు పది శాతం కన్న తక్కువ
దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని గణనీయం గా పెంచారు. ఇప్పటివరకు 37.81 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25.31 కోట్ల వాక్సిన్ డోస్‌లను వేశారు.
***
(रिलीज़ आईडी: 1726820)
आगंतुक पटल : 154