రక్షణ మంత్రిత్వ శాఖ
ఎఎల్‌హెచ్ఎంకె-IIIను ప్రవేశపెట్టడం ద్వారా తన వైమానిక అంగానికి బలాన్ని జోడించిన కోస్ట్ గార్డ్
Posted On:
12 JUN 2021 2:43PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రక్షణశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ శనివారంనాడు ఆధునాతన లైట్ హెలికాప్టర్లు (ఎఎల్‌హెచ్) ఎంకె -III ని భారత కోస్ట్‌గార్డ్ (ఐసిజి) లో ప్రవేశపెట్టారు. అత్యాధునిక హెలికాప్టర్లను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) దేశీయంగా రూపొందించి, తయారు చేస్తోంది.
క్లిష్టమైన సమయంలో ఈ హెలికాప్టర్లను ప్రవేశపెట్టడంలో ఐసిజి, హెచ్ఎఎల్‌ను ప్రవేశపెట్టడంలో, ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా దార్శనికతను పురోగమింపచేయడం పట్ల చూపిన పట్టుదల, శ్రమను డాక్టర్ అజయ్ కుమార్ తన ఉపన్యాసంలో ప్రశంసించారు. పలు కోస్ట్ గార్డ్ కార్యకలాపాలలో ఉపయోగించేందుకు ఈ అధునాత హెలికాప్టర్లు ఐసిజికి ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ -19 ప్రోటోకాళ్ళకు అత్యంత ప్రాధన్యతను ఇస్తూ, ప్రభుత్వ దార్శనికత అయిన డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూ న్యూఢిల్లీ నుంచి డిజిటల్ మాధ్యమం ద్వారా బెంగళూరులో నిర్వహించారు. ఐసిజి అవసరాలను తీర్చేందుకు, 19 అదనపు పరికరాలను అంతర్గతంగా అనుకులీకరించడం ద్వారా రూపొందించి ఎఎల్ హెచ్ ఎంకె -III మెరైన్ వెర్షన్‌ను హెచ్ఎఎల్ అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది మధ్యాంతరం నాటికి ఐసిజికి 16 ఎఎల్‌హెచ్ ఎంకె -IIIలను హెచ్ఎఎల్ సరఫరా చేయనుంది. ఓడల నుంచి కార్యకలాపాలను చేపట్టగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి సముద్రం-ఆకాశంలో సమన్వయ శోధన, నిషేధ సామర్ధ్యాలు, తీర భద్రత, అన్వేషణ, రక్షణ కార్యకలాపాలు, వైద్య తరలింపు, మానవీయ మిషన్లు, కాలుష్య ప్రతిస్పందన మిషన్ల తదితర అంశాలలో కోస్ట్ గార్డ్ సామర్ధ్యాలను మెరుగుపరచనున్నాయి.
ఇటీవలే నిర్వహించిన మత్తు పదార్ధాలు, ఆయుధాల స్వాధీనంలో విజయవంతమైన ఆపరేషన్‌ను, టౌక్టే, యాస్ తుపాన్ల సందర్భంగా ప్రాణాలను కాపాడినందుకు అభినందిస్తూ, ప్రభుత్వం ఐసిజికి అప్పగించిన భారమైన బాధ్యతలను పరిగణలోకి తీసుకుని సేవ సామర్ధ్యాన్ని, శక్తి, యోగ్యతను క్రమంగా వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు.
వాటిని ఐసిజిలో ప్రవేశ పెట్టిన వెంటనే 16 ఎఎల్‌హెచ్ ఎంకె- III లను భుబనేశ్వర్, పోర్‌బందర్, కొచ్చి, చెన్నైలలో గల నాలుగు కోస్ట్ గార్డ్ స్క్వాడ్రన్‌లలో ఉంచనుననారు.
తీర ప్రాంతం గల రాష్ట్రాలతో పంచుకునే సముద్ర సరిహద్దులు అవినీతి కార్యకలాపాలకు అవకాశమిస్తాయని, పైగా ఈ ప్రాంతాలు తరచు తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉంది. ఓడపై నుంచి కార్యకలాపాల ద్వారా ఈ స్క్వాడ్రన్లు నిరాటంకమైన నిఘాకు హామీ ఇవ్వడమే కాక, సముద్రంలో చిక్కుకున్న బెస్తవారికి సహాయాన్ని అందిస్తాయి.
ఇటీవలి కాలంలో ఏకకాలంలో విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించిన తత్రక్షకుల కృషిని గుర్తించి, కృతజ్ఞతలు చెప్తూ, తన విధులను నిర్వర్తించేందుకు ఐసిజి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎఎల్‌హెచ్ ఎంకె-III లు తమ ఓడపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, నిఘా సామర్ధ్యాలను విస్తారంగా పెంచుకునే సామర్ధ్యంలో నూతన మార్పును తీసుకువస్తుందని కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ కె. నటరాజన్ అభిప్రాయపడ్డారు.ఈ హెలికాప్టర్లు బాధ్యత ఉన్న ప్రాంతం, దాని ఆవలలో సేవా సామర్ధ్యంలో బలోపేతం చేసేందుకు ఓడలు, విమానాలతో సమన్వయంతో కూడిన మాతృకలో మోహరిస్తామని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమానికి హెచ్ఎఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. మాధవన్, రక్ష మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.


***
(Release ID: 1726674)
Visitor Counter : 236