శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పరిశ్రమకు మద్దతును పెంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి (సి ఎస్ ఐ ఆర్)
స్వరూపాన్ని మార్చాలని సిఫార్సు చేసిన అసాధారణ కమిటీతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ సమావేశం
21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఒక "నూతన సిఎస్ఐఆర్" గా రూపుదిద్దుకోగల సామర్ధ్యం సి ఎస్ ఐ ఆర్ కు ఉంది. మరియు విశ్వవ్యాప్తంగా ఉన్న సంస్థలతో పోటీపడగలదు. శాస్త్ర విజ్ఞానాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సామాన్యుల సమస్యలను తీర్చి ఉపశమనం కలిగించగలదు: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
09 JUN 2021 6:32PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్ కార్యకలాపాల భవిష్యత్ రూపకల్పనపై ఏర్పాటు చేసిన సమగ్ర అసాధారణ కమిటీ సిఫార్సులపై సమీక్ష సందర్బంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక , భూ విజ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కు సిఫార్సులను గురించిన స్థూలదృష్టి కల్పించడం జరిగింది. ఈ సిఫార్సుల అమలు వల్ల సిఎస్ఐఆర్ సంస్థ 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా విశ్వవ్యాప్త పోటీకి సిద్ధం కాగలదు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మేధో సంపత్తిని సిద్ధంచేసి వినియోగించుకునే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని , అంకిత భావంతో పనిచేస్తున్న శాస్త్రీయ సమాజం సహకారంతో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నిలకడైన సమగ్ర అభివృద్ధిని సాధించాలనే కలను నిజం చేసుకోవాలని సంకల్పమని మంత్రి అన్నారు. గడచిన ఏడు
సంవత్సరాలలో జాతీయ ప్రాధాన్యతలకు సరిజోడుగా పరిశోధనాభివృద్ధి జరగడం చెప్పుకోదగిన విషయమని ఆయన అన్నారు.
పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టులలో పారిశ్రామిక వర్గాలు మరియు విద్యావేత్తల సహకారంపై దృష్టిని కేంద్రీకరించాలని, ఇందుకోసం
'ప్రజల కోసం సైన్స్ మరియు సైన్స్ కోసం ప్రజలు' అనే భావన అవసరమని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించడం కోసం 'జిజ్ఞాస' తరహాలో భిన్నంగా ఆలోచించవలసిన అవసరం ఉందని , తద్వారా ఉత్సాహవంతలు, కొత్త పరిశోధనలపట్ల కుతూహలం ఉన్న యువతరం ప్రాతినిధ్యాన్ని నిశ్చయం చేసుకోగలమని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త పనులకు ఉపక్రమించే విధంగా ప్రభుత్వం అనేక అంకుర సంస్థలకు సాయపడుతోందని కూడా ఆయన తెలిపారు.
ప్రస్తుతం మన దేశ ప్రయోగశాలల్లో అందుబాటులో ఉన్న ఉన్నతశ్రేణి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని సామాన్యుల దైనందిన అవసరాలను తీర్చే అంశాలపై పరిశోధన జరపడంలో సాధ్యాసాధ్యాలను అనేశించాలని మంత్రి అన్నారు. శాస్త్ర పరిశోధన వల్ల లభించిన విజయాలకు సామాన్యులకు ప్రయోజనం చేకూర్చదానికి మధ్య ఉన్న అంతరాన్ని తక్షణం పూడ్చవలసిన అవసరం ఉందని, అవి సామాన్యులకు అందుబాటులోకి రావాలని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై శాస్త్రీయ సమాజం తమ దృష్టిని కేంద్రీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దార్శనికత మరియు దిశానిర్దేశం వల్లనే అది సాధ్యమవుతుందని అన్నారు.
భారత దేశానికి స్వాతంత్త్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యే 2022 నాటికి 21వ శతాబ్దానికి అనుగుణమైన రీతిలో 'కొత్త సిఎస్ఐఆర్' ఆవిర్భవించడానికి శాస్త్రీయ సమాజం కృషి చేయాలని, తద్వారా సామాన్యుల సమస్యలను తీర్చడానికి దోహదం చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ కార్యదర్శి , సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టార్ శేఖర్ సి. మండే తదితరులు ప్రసంగించారు.
సిఎస్ఐఆర్ ఆధునికీకరణకోసం తొలుత ప్రొఫెసర్ విజయ రాఘవన్ కమిటీ ఏర్పాటైంది. భారత పారిశ్రామిక రంగానికి సాంకేతిక సహకారంపై దృష్టిని కేంద్రీకరించడం చర్యల గురించి ఈ కమిటీ నివేదిక సమర్పించింది. ఆ కమిటీ నివేదికలోని అంశాల అమలు కోసం ఏర్పాటైన సమగ్ర అసాధారణ కమిటీకి టాటా కన్సల్టెన్సీ మాజీ సిఈఓ శ్రీ ఎస్. రామ్ దొరై అధ్యక్షుడు. విజయ రాఘవన్ కమిటీ నివేదికలోని అంశాల ప్రాతిపదికగా అసాధారణ కమిటీ నేతృత్యంలో ఎనిమిది ఉపసంఘాలను కూడా ఏర్పాటుచేశారు. తమ తమ రంగాలలో నిపుణులైన డాక్టర్ విలాస్ శంకర్, డాక్టర్ సంగీతా రెడ్డి, శ్రీ నివృతి రాయి, డాక్టర్ విజయ్ పి. భట్కర్, డాక్టర్ వి. సుమంత్రం, ప్రొఫెసర్ రిషికేశ కృష్ణన్, శ్రీ సంజీవ్ సన్యాల్ మరియు డాక్టర్ రాజ్ హీర్వానీ అసాధారణ కమిటీ సభ్యులు.
****
(Release ID: 1726035)
Visitor Counter : 169