ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
రైతులకు ‘డిమాండ్ ఆధారిత టెలీ అగ్రికల్చర్ సలహా’లను అందించడానికి డిజిటల్ ఇండియా కార్పొరేషన్ & ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Posted On:
09 JUN 2021 6:17PM by PIB Hyderabad
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 'డిమాండ్ ఆధారిత టెలీ అగ్రికల్చర్ సలహాలను’ అందించడం ద్వారా రైతులకు సౌకర్యాలు కల్పించడానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డిఐసి), ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఢిల్లీలోని కృషి భవన్‌లో బుధవారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి ఐకార్ సెక్రటరీ (డీఏఆర్ఈ) & డైరెక్టర్ జనరల్, డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్, అదనపు కార్యదర్శి (డీఏఆర్ఈ) & కార్యదర్శి (ఐకార్) డిఐసి మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అభిషేక్ సింగ్ అధ్యక్షత వహించారు. ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్) డాక్టర్ ఎకె సింగ్, డిఐసి సీనియర్ డైరెక్టర్ (రీసెర్చ్) డాక్టర్ వినయ్ ఠాకూర్, ఐకార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐసీటీ) డాక్టర్ అనిల్ రాయ్, ఐకార్ ఏడీజీ (అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్) డాక్టర్ రణధీర్ సింగ్ పోస్వాల్ , ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, డిఐసి డాక్టర్ టిఎస్ అనురాగ్, డీఐసీ ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అన్షుల్ పోర్వాల్, డిఐసి ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిఐసి ప్రస్తుత ఇంటరాక్టివ్ సమాచార వ్యాప్తి వ్యవస్థ (ఐఐడిఎస్) వేదికను ఐకార్ ప్రతిపాదిత కిసాన్ సారథి కార్యక్రమంతో ఐకార్ నెట్‌వర్క్ ద్వారా అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులను చేరుకోవడం ఈ ఎంఓయు లక్ష్యం. స్థానికంగా వివిధ వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడటానికి మల్టీ మీడియా, మల్టీ–-వే అడ్వైజరీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను స్థాపిస్తారు. దీనిని నిర్వహించడానికి ఐసీటీ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తారు. దీనిని అమలు చేయడానికి ఐకార్, డిఐసి సహకరిస్తాయి. ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి వ్యవస్థ (ఐఐడిఎస్)ను ఐకార్ లో మోహరిస్తారు. ఇది పుష్-అండ్ పుల్-బేస్డ్ సిస్టమ్. మొబైల్ ఫోన్లు ఉపయోగించి రైతుల నుండి వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవచ్చు. రైతులకు కోరినట్టుగా వ్యక్తిగత అవసరాల ఆధారిత సమాచారాన్ని ఐఐడిఎస్ అందిస్తుంది. వారి ప్రశ్నలకు ప్రతిస్పందించేటప్పుడు, నిపుణులు రైతుల సమాచారాన్ని తీసుకుంటారు. దీనివల్ల ఆయా నిపుణులు రైతులు లేవనెత్తిన సమస్యలను లేదా క్షేత్ర సమస్యలను మెరుగైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు (కేవైఎఫ్.. - మీ రైతును తెలుసుకోండి) రైతుకు వ్యక్తిగతీకరించిన పద్ధతిలో త్వరితగతిన తగిన పరిష్కారాలను అందిస్తారు. ప్రస్తుతం ఐఐడిఎస్ ప్లాట్‌ఫాంను ఈశాన్య రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో మోహరించారు. ఐసిఎఆర్‌తో ఈ అవగాహన ఒప్పందం వల్ల వీటిని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఐసీటీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి, హోస్టింగ్ చేయడానికి, నిర్వహించడానికి డిఐసి మొత్తం సాంకేతిక పరిష్కారాలను అందించనుంది. ఐకార్ విస్తరణ సేవల నెట్‌వర్క్ ద్వారా కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కెవికెలు), వివిధ పరిధుల్లోని నిర్దిష్ట పరిశోధనా సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్ మొదలైన వాటి ద్వారా దశలవారీగా మొత్తం కార్యకలాపాలను నిర్వహిస్తుంది. పర్యవేక్షిస్తుంది.
(Release ID: 1725812)
Visitor Counter : 234