నీతి ఆయోగ్

2020-2050ల మధ్య భారతదేశం రవాణాకు అవుతున్న ఇంధనంలో 311 లక్షల కోట్ల రూపాయల వరకు ఆదా చేయవచ్చును.. నివేదిక

రానున్న మూడు దశాబ్దాల కాలంలో లో 10 గిగాటన్నుల వరకు బొగ్గుపులుసు వాయువు విడుదలను తగ్గించగల సామర్ధ్యం భారతదేశం కలిగివుంది .. వెల్లడించిన నీతీ ఆయోగ్ ఆర్‌ఎంఐ నూతన అధ్యయనం

Posted On: 09 JUN 2021 2:52PM by PIB Hyderabad

రావన్న ఖర్చులను గణనీయంగా తగ్గించడానికి భారతదేశంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రవాణా రంగంపై నీతీ ఆయోగ్,  ఆర్‌ఎంఐ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. భారతదేశంలో రవాణా రంగం- తక్కువ ఖర్చుతో కాలుష్యరహిత రవాణా అనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది. 

వస్తువులు సేవలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో సరకుల రవాణా గణనీయంగా పెరుగుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి సరకుల రవాణా పెరగవలసి ఉంటుంది. అయితే, దీనివల్ల ఖర్చులు పెరగడమే కాకుండా బొగ్గు పులుసు వాయువు ఎక్కువగా విడుదల కావడంతో పట్టణాల్లో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది.. అయితే, ఖర్చులను వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగల సామర్ధ్యం భారతదేశానికి ఉందని వెల్లడయ్యింది. 

ఈ అధ్యయనం ప్రకారం భారతదేశం 

1. జీడీపీలో 4%వరకు రవాణా ఖర్చులను భారతదేశం తగ్గించగలదు 

2. 2020-2050ల మధ్య మొత్తంగా 10 గిగా టన్నుల వరకు సిఓ2 విడుదలలు తగ్గుతాయి 

3. 2050 నాటికి నైట్రోజన్ ఆక్సైడ్ ను 35%వరకు గాలిలో కలిసే రేణువులను ( పీఎం)ను 28% వరకు తగ్గించవచ్చును. 

అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థకు రవాణా రంగం వెన్నుముకగా ఉంటుందని పేర్కొన నీతీ ఆయోగ్ సలహాదారుడు( రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు జె. సిన్హా ఈ రంగంలో ఖర్చులను తగ్గించి పర్యావరణహితంగా మార్చవలసి ఉంటుందని అన్నారు. సమర్ధవంతమైన రవాణా రంగంద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న మేక్ ఇన్ ఇండియా,ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయని ఆయన అన్నారు. 

2050 నాటికి దేశ రవాణా రంగం అయిదు రేట్లు అభివృద్ధి చెందుతుందని అంచనా. ఇదేసమయంలో 400 మిలియన్ ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్ళే అవకాశం ఉంది. దీనితో రవాణా రంగ వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా. 

రవాణా వ్యవస్థలో వచ్చే మార్పులకు అనుగుణంగా నూతన విధానాలను అన్వేషించక తప్పదని  ఆర్‌ఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ క్లే స్ట్రేంజర్ స్పష్టం చేశారు. దీనికోసం రైళ్ల ద్వారా సరకులను రవాణా చేయడం, సమర్ధవంతమైన  రవాణా వ్యవస్థకు రూపకల్పన చేయవలసి ఉంటుందని అన్నారు. కాలుష్య రహిత వాహనాలు, విద్యుత్ వాహనాల వినియోగానికి భారతదేశం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ఈ పద్దతులను అనుసరించడం ద్వారా భారతదేశం రానున్న 30 సంవత్సరాల కాలంలో 311 లక్షల కోట్ల రూపాయల వరకు ఆదా చేయగలుగుతుందని ఆయన వెల్లడించారు. 

విధాన నిర్ణయాలు, సాంకేతికత, మార్కెట్, మౌలిక సౌకర్యాల కల్పన, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను నివేదికలో పొందుపరిచారు. రైళ్ల ద్వారా రవాణాను ఎక్కువచేయడానికి  వసతులను కల్పించాలని, వివిధ రకాల రవాణా వ్యవస్థలను రూపొందించాలని, గిడ్డంగుల సామర్ధ్యాన్ని ఎక్కువ చేయాలని నివేదికలో సిఫార్సు చేశారు. ఇంధన ఆదాకు ప్రాధాన్యత ఇస్తూ, పర్యావరణహిత రవాణా వ్యవస్థలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలని నివేదికలో సిఫార్సు చేశారు. 

ఈ ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చినప్పుడు రవాణా రంగంలో భారతదేశం మరింత అభివృద్ధి సాధించి  ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందడానికి అవకాశం కలుగుతుంది. 

***(Release ID: 1725738) Visitor Counter : 32