సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 సంక్రమణ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి పింఛను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

Posted On: 08 JUN 2021 5:46PM by PIB Hyderabad

కోవిడ్-19 సంక్రమణ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి పింఛను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖలోని పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపిపిడబ్ల్యు) కుటుంబ పింఛను కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి అర్హతగల కుటుంబ సభ్యుడి నుండి క్లైమ్ స్వీకరించిన ఒక నెలలో ప్రారంభమయ్యేలా చూడాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌తో పాటు పెన్షన్ పంపిణీ బ్యాంకుల సిఎమ్‌డిలను ఆదేశించింది. 

కొత్త ఆదేశాలు ప్రకారం, అన్ని కార్యదర్శులను వ్యక్తిగతంగా కోరారు. సర్వీసులో ఉండగా మరణించిన కేసులను కార్యదర్శులంతా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మరియు క్లెయిమ్ మరియు డెత్ సర్టిఫికేట్ అందిన ఒక నెలలోపు కుటుంబ పింఛను అందడం ప్రారంభం కావాలని  ఈశాన్య ప్రాంత(డోనెర్) అభివృద్ధి, పిఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ కార్యదర్శులకు సూచించారు. కార్యదర్శులు ఈ ప్రయోజనం కోసం ఆయా శాఖలలో ఒక అధికారి నామినేట్ చేస్తారు, సంబంధిత మంత్రిత్వ శాఖ / విభాగం అధికారి పేరు, సంప్రదింపు వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటె, క్లెయిమ్ ఆలస్యం అయినప్పుడు సంబంధిత కుటుంబ సభ్యులు సంప్రదించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే సమయంలో, ప్రతి మంత్రిత్వ శాఖ అటువంటి కేసుల నెలవారీ తాజా పరిస్థితిని పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖకు పంపాల్సి ఉంటుంది.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారికి సంబంధించిన ప్రతి అంశాన్ని రోజువారీ ప్రాతిపదికన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నందున ఇది చాల సున్నితమైన అంశమని అన్నారు. మహమ్మారి బారిన పడిన పౌరులు మరియు కుటుంబాలకు సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. పెన్షన్ విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇటీవలి కాలంలో కోవిడ్ -19 మహమ్మారి వల్ల అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెన్షన్ బాధిత కుటుంబాలకు త్వరగా విడుదలయ్యేలా చూడాలని అధికారులను డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశించారు. 

కుటుంబ పెన్షన్ కోసం పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పిపిఓ) జారీ చేస్తున్నామని, కుటుంబ పెన్షన్ కోసం క్లెయిమ్ అందిన రోజు నుండి ఒక నెల దాటకుండా సాధారణ కుటుంబ పెన్షన్ పంపిణీని బ్యాంక్ ప్రారంభించేలా చూడాలని అన్నారు.

ప్రభుత్వ అన్ని విభాగాలు ఈ సూచనలను కచ్చితంగా పాటిస్తాయని, సంబంధిత విభాగాధిపతులు దీనిని రోజూ పర్యవేక్షిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారి నేపథ్యంలో వివిధ రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం కూడా ఈ పద్ధతిని అనుకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

                                                                          

<><><><><>



(Release ID: 1725545) Visitor Counter : 217