ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సార్వ‌త్రిక వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని సాధించేందుకు వాక్సిన్ల కోసం తాజా ఆర్డ‌ర్‌

25 కోట్ల డోస్‌ల కోవిషీల్డ్‌, 19 కోట్ల కోవాక్సిన్ డోస్‌ల‌ను సేక‌రించ‌నున్న ప్ర‌భుత్వం

Posted On: 08 JUN 2021 4:47PM by PIB Hyderabad

ఈ ఏడాది జ‌న‌వ‌రి 16 వ తేదీ నుంచి ప్ర‌భుత్వ మొత్తానికి సంబంధించిన‌ విధానం కింద చేప‌ట్టిన వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వానికి అందిన వివిధ ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం , 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారంద‌రికి ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల‌లో కోవిడ్ -19 వాక్సిన్ ను ఉచితంగా వేస్తారు.

జాతీయ కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో మార్పున‌కు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి నిన్న‌ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు 25 కోట్ల డోస్‌ల కోవిషీల్డ్‌, 19 కోట్ల డోస్‌ల కోవాక్సిన్ డోస్‌ల కోసం భార‌త్ బ‌యోటెక్‌కు ఆర్డ‌ర్లు పెట్టింది.
2021 డిసెంబ‌ర్ నాటికి 44 కోట్ల డోస్‌ల కోవిడ్ -19 వాక్సిన్ అందుబాటులో ఉండ‌నుంది.
దీనికితోడు కోవిడ్ వాక్సిన్ కు సంబంధించి 30 శాతం అడ్వాన్స్ ప్రోక్యూర్‌మెంట్‌కు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్‌, భార‌త్ బ‌యోటెక్‌ల‌కు అడ్వాన్సులో 30 శాతం మొత్తాన్ని విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.

***


(Release ID: 1725456) Visitor Counter : 233