విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకున్న ఎన్‌హెచ్‌పిసి

Posted On: 05 JUN 2021 7:37PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప్ర‌ముఖ జ‌ల‌విద్యుత్ కంపెనీ ఎన్‌హెచ్‌పిసి ఇండియా 5జూన్‌, 2021న ఫ‌రీదాబాద్‌లోని ఎన్‌హెచ్‌పిసి రెసిడెన్షియ‌ల్ కాల‌నీలో గొప్ప ఉత్తేజం, ఉత్సాహంతో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ను నిర్వ‌హించింది.
వేడుక‌ల సంద‌ర్భంగా వివిధ ఫ‌ల‌, ఛాయ‌ను ఇచ్చే రావి, అశోక‌, మామిడి, సీతాఫ‌లం, నేరేడు, స‌పోటా, బ‌త్తాయి, నిమ్మ‌, జామ వంటి  60 మొక్క‌ల‌ను ఎన్‌హెచ్‌పిసి కాల‌నీలో నాటారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ ఇతివృత్త‌మైన ప్ర‌కృతితో సంబంధాన్ని పున‌రుద్ధ‌రంచుకోవ‌డం అన్న అంశానికి అనుగుణంగా కాల‌నీవ్యాప్తంగా చెట్ల పై ఉన్న  ప‌క్షి గూళ్ళు, ఉడ‌త గూళ్ళ‌ను ఏర్పాటు చేశారు. ఈ ప‌క్షి గూళ్ళు ప‌క్షుల‌కు స‌రైన ఆవాసాన్ని, భ‌ద్ర‌త‌ను ఇవ్వ‌డ‌మే కాక వాటి సంఖ్య పెరిగేందుకు తోడ్ప‌డతాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌దార్ధాలైన  ప‌ర్యావ‌రణానుకూల పళ్ళు, కాయ‌గూర‌లు, విత్త‌నాలు, పెన్సిళ్ళు, వెదురు బొగ్గుతో చేసిన టూత్ బ్ర‌ష్‌ల‌ను  ఎన్‌హెచ్‌పిసి ఉద్యోగుల పిల్ల‌ల‌కు పంపిణీ చేశారు. ప్రాంతీయ కార్యాల‌యాల వ‌ద్ద‌ ఎన్‌హెచ్‌పిసి కార్య‌క‌లాపాలు సాగించే స్థ‌లాల‌లో, విద్యుత్ స్టేష‌న్లు, ప్రాజెక్టుల వ‌ద్ద ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం 2021 సంద‌ర్భంగా భారీ స్థాయిలో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కాలంలో సోష‌ల్ డిస్టెన్సింగ్‌తో పాటుగా అన్ని భ‌ద్ర‌తా జాగ్ర‌త్త‌ల‌ను అనుస‌రిస్తూ ప‌రిమిత సంఖ్య ఉద్యోగుల‌తో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1724833) Visitor Counter : 114


Read this release in: Urdu , English , Hindi , Punjabi