రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం 2021


స‌ముద్ర జ‌లాల‌లో ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న భార‌త నావికా ద‌ళం

Posted On: 05 JUN 2021 12:47PM by PIB Hyderabad

నౌకాద‌ళం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా అత్యంత బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించే ద‌ళం. ఇది ఎల్ల‌వేళ‌లా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత కార్యక్ర‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంది. స‌ముద్ర ర‌క్ష‌ణ‌లోని భార‌త‌నౌకాద‌ళం ఎన్నో నౌక‌లు, స‌బ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్టుల‌ను ఉప‌యోగిస్తుంది. ఇవి ఎక్కువ ఇంధ‌న వినియోగ తీవ్ర‌త క‌లిగిన‌వి.
నానాటికి త‌రిగిపోతున్న శిలాజ ఇంధ‌నాల కార‌ణంగా నౌకాద‌ళం చేప‌ట్టే ప్ర‌తి కార్య‌క‌లాపంలోనూ ఇంధ‌నాన్ని పొదుపు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. ఈ దిశ‌గా భార‌త నౌకాద‌ళం స‌మంగ్ర భార‌త నావికాద‌ళ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ రోడ్‌మ్యాప్ ( ఐఎన్ఇసిఆర్‌)ను గ్రీన్ ఫుట్ ప్రింట్‌తో బ్లూవాట‌ర్ కార్య‌క‌లాపాల ల‌క్ష్యంగా చేప‌ట్టింది.
ఇంధ‌న సామ‌ర్థ్యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంతో నౌకాద‌ళం ప‌లు విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్న‌ది. ఇవి మంచి ఫ‌లితాల‌ను అందించాయి.

ఈ ఫ‌లితాలు అన్ని నౌకాద‌ళ విభాగాల‌లో క‌నిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ముఖ్య‌మైన‌వి ప‌రిశుభ్రమైన , హ‌రిత నౌకాద‌ళం. సామాజిక దూర‌ర‌రం , కోవిడ్ -19 ప్రొటోకాల్స్ పాటిస్తూ ఇందుకు సంబంధించిన ప‌లు కార్య‌క‌లాపాల‌ను నౌకాద‌ళం చేప‌ట్టింది. వీటిని రానున్న పేరాల‌లో వివ‌రించ‌డం జ‌రిగింది.

భార‌త నౌకాద‌ళం, 2020 జూలైలో ఎజిమ‌ల‌లో ని భార‌త నౌకాద‌ళ అకాడ‌మీలో 3 మెగావాట్ల సామ‌ర్థ్యంగ‌ల భారీ సౌర‌విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. మ‌రో 2 మెగావాట్ల సామ‌ర్ధ్యంగ‌ల సౌర విద్యుత్ ప్లాంటు ను 2020 జూలైలో ముంబాయి లోని క‌రంజాలో ఏర్పాటు చేశారు. దీనితో భార‌త నౌకాద‌ళ స్థాపిత సౌర‌విద్యుత్ సామ‌ర్థ్యం నౌకాద‌ళ కేంద్రాల‌లో 11 మెగా వాట్లుగా ఉంది. ఈ ప్లాంట్లు గ్రిడ్‌తో అనుసంధాన‌మై అత్య‌ధునాత‌న సింగిల్ యాక్సిస్ స‌న్ ట్రాకింగ్ టెక్నాల‌జీని కంప్యూట‌రైజ్డ్ మానిట‌రింగ్‌, కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటున్నాయి. భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ నేష‌న‌ల్ సోలార్ మిష‌న్ (జెఎన్ఎన్ ఎస్ఎం) మిష‌న్  ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఎస్‌.పి.వి ల ఏర్పాటు ఉంది.

 

నిరంత‌రం మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగంగా 30,000 మొక్క‌ల‌ను నౌకాద‌ళం నాటింది. సంవత్స‌రానికి 630 ట‌న్నుల కార్బ‌న్ డ‌యాక్సైడ్ ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు నిరంత‌ర మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ది. దీనికితోడు మియాకి అడ‌వుల వంటి న‌గ‌ర అట‌వీ ప్రాంతాల‌ను  ఏర్పాటు చేస్తున్న‌దిఇ. అలాగే కోస్తా ప్రాంతంలో మొక్క‌ల పెంప‌కం, మ‌డ అడ‌వుల పెంప‌కం వంటివి 2021 ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ ముఖ్యాంశ‌మైన ప‌ర్యావ‌ర‌ణ పునరుద్ధ‌ర‌ణ‌కు అనుగుణంగా చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది.

మ‌డ అడ‌వుల పెంపక కార్య‌క్ర‌మాన్ని కోచిలోన ద‌క్షిణ నావిక‌ద‌ళ క‌మాండ్ కేర‌ళ అట‌వీ శాఖ‌తో క‌ల‌సి చేప‌ట్టింది. దీనిని ప్ర‌పంచ న‌దుల దినోత్స‌వం నాడు వెందుర్తి ఛాన‌ల్ వెంట్ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా స‌మారు 200 మొక్క‌లు నాటార‌రు. ద‌క్షిణ నావికా ద‌ళ కేంద్ర కార్యాల‌యంం , ఐఎన్ఎస్ వెందుర్తితో క‌ల‌సి నిరంత‌రం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, ఇంధ‌న పొదుపు కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ వ‌స్తున్న‌ది. దీనితో ఈ కేంద్ర ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్ మెంట్ అవార్డ్ (జిపిఇఎంఎ)ను ప్ర‌భుత్వ ( ర‌క్ష‌ణ‌) రంగంలో 2020 సంవ‌త్స‌రానికి అందుకుంది..

స్వ‌చ్ఛ సేవ ప్ర‌చార‌లో భాగంగా నౌకాద‌ళ కేంద్ర  ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు , వ‌ర‌ద‌, వ‌ర్ష‌పు నీటి తొల‌గింపు, డ్రెయిన్లు శుభ్ర‌ప‌ర‌చ‌డం, తోట‌ల‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డం వంటి కార్య‌క్రమాలు చేప‌ట్టింది. అలాగే అంత‌ర్జాతీయ కోస్తా ప్రాంత శుభ్ర‌తా కార్య‌క్ర‌మంలో భాగంగా , కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌ను క‌చ్చితంగా పాటిస్తూ వివిధ నావికాద‌ళ యూనిట్లు కోస్తా ప్రాంత ప‌రిశుభ్ర‌తా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాయి.

 సిబ్బంది, స‌ర‌కుర‌వాణాకు బ్యాట‌రీ ఆధారిత ఈ వాహ‌నాలు వాడ‌డం ద్వారా శిలాజ ఇంధ‌నాల వాడకాన్ని త‌గ్గించింది.త‌ద్వారా కార్బ‌న్ డ‌యాక్సైడ్ విడుద‌ల త‌గ్గించ‌గ‌లిగింది. దీనికి తోడు శిలాజ ఇంధ‌నాలు వినియోగించే వాహ‌నాలపై ఆధార‌ప‌డ‌డాన్నిత‌గ్గించేందుకు వివిధ యూనిట్లు క్ర‌మంతప్ప‌కుండా వాహ‌నాల వాడ‌కానికి దూరంగా ఉంటున్న‌ రోజును పాటిస్తున్నాయి.

నౌకా కేంద్రాల‌లోఓ  చ‌మురు ఒలికిపోవ‌డాన్ని ఎదుర్కొనేందుకు ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన మెరైన్ బ‌యో రెమిడియ‌ల్ ఏజెంట్ల‌ను దేశీయంగానే ఎన్‌.ఎం.ఆర్‌.ఎల్ ద్వారా అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది.
నౌకాద‌ళ క్షేత్రంలో అత్యంత అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం ప్ర‌త్యేక‌త క‌లిగి ఉంటుంది. ఈ ఉత్ప‌త్తిలో మైక్రో ఆర్గానిజ‌మ్‌లు, వాటి ని అభివృద్ధికి చోద‌క‌మైన‌వి ఉంటాయి. ఇవి వివిధ ర‌కాల చ‌మురును అంటే డీజిల్‌, లూబ్రికేటింగ్ , మ‌డ్డి చురు వంటి వాటిని ఉప‌యోగించుకుని ప‌రిశుభ్ర‌మైన జ‌లాలు త‌యారు కావ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌ద్వారా స‌ముద్ర జ‌లాలలో చ‌మురు వ్య‌ర్థాలుతొల‌గి అవి ప‌రిశుభ్రం కావ‌డానికి వీలు క‌లుగుతుంది. ఆ ర‌కంగా స‌ముద్ర ప‌ర్యావ‌ర‌ణం కాపాడ‌బ‌డుతుంది.  ఇందుకు సంబంధించిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిఇ 2020 జూన్‌లో భార‌త నౌకాద‌ళంలో చేర్చ‌డం జ‌రిగింది.


మోత్తంగా కార్బ‌న్ ఫుట్‌ప్రింట్‌ను త‌గ్గించి, గ్లోబల్ వార్మింగ్ ప్ర‌భావాన్ని త‌గ్గించేదుకు భార‌త నౌకాద‌ళం స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది. పర్యావ‌ర‌ణ హిత‌క‌ర చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ఇది స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది. భ‌విష్య‌త్‌త‌రాల‌కు ప‌రిశుభ్ర‌మైన‌, ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర భ‌విష్య‌త్తును అందించే దిశ‌గా భార‌త నౌకాద‌ళం క‌ట్టుబ‌డి ఉంది.

 

***



(Release ID: 1724742) Visitor Counter : 180