ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్‌


రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు 24 కోట్లకు పైగా వాక్సిన్ డోస్‌లు అందించ‌డం జ‌రిగింది.
ఇప్ప‌టికీ రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల వ‌ద్ద‌ వాక్సిన్ వేసేందుకు 1.93 కోట్ల డోస్‌లు అందుబాటులో ఉన్నాయి.

Posted On: 04 JUN 2021 10:33AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న వాక్సినేష‌న్‌లో భాగంగా భార‌త ప్ర‌భుత్వం , ఉచితంగా కోవిడ్ వాక్సిన్‌ను రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అందించడం ద్వారా వాటికి అండ‌గా నిలుస్తున్న‌ది.దీనికి తోడు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు వాక్సిన్ ను నేరుగా స‌మ‌కూర‌ర్చుకునేందుకువ ఈలు క‌ల్పిస్తున్న‌ది.  కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌డంలో వాక్సినేష‌న్ అనేది భార‌త ప్ర‌భుత్వ స‌మ‌గ్ర వ్యూహంలో ఒక ముఖ్య‌మైన భాగంగా ఉంది. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్ కోవిడ్  జాగ్ర‌త్త‌లు పాటించ‌డంతో పాటు వాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మైన అంశంగా చూస్తున్నారు.

స‌ర‌ళీకృత వేగ‌వంత‌మైన ఫేజ్ 3 కోవిడ్ -19 వాక్సినేష‌న్ వ్యూహం 2021 మే 1 నుంచి ప్రారంభ‌మైంది.

 

***


(Release ID: 1724382) Visitor Counter : 154