రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కశ్మీర్‌ నియంత్రణ రేఖ వెంట ఉన్న రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష

Posted On: 03 JUN 2021 4:13PM by PIB Hyderabad

కశ్మీర్‌ లోయలో రెండో రోజు పర్యటనలో; నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్‌) జనరల్‌ ఎం.ఎం.నరవణె సమీక్షించారు.

    ఉత్తర సైనికదళం కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ జోషి, చినార్‌ కార్ప్స్‌ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ డి.పి.పాండేతో కలిసి సీవోఏఎస్‌ పర్యటన కొనసాగించారు. వివిధ యూనిట్లను పరిశీలించారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలను ఆయా యూనిట్ల కమాండర్లు సీవోఏఎస్‌కు వివరించారు. సైనికులు చూపుతున్న ధైర్యాన్ని, కార్యాచరణ సన్నద్ధతను సీవోఏఎస్‌ ప్రశంసించారు. నియంత్రణ రేఖ వెంట ఉన్న ప్రస్తుత ప్రశాంత పరిస్థితిని అభినందించిన సీవోఏఎస్‌, దేశ రక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం చూపవద్దని, ఎలాంటి సవాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, కొవిడ్‌ను ఎదుర్కొనడానికి వివిధ ప్రభుత్వ సంస్థలు చేస్తున్న కృషిని కూడా జనరల్‌ ఎం.ఎం.నరవణె మెచ్చుకున్నారు.

 

***



(Release ID: 1724221) Visitor Counter : 130