గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సుస్థిర నగరాభివృద్ధి రంగం లో భారతదేశం, జపాన్ ల మధ్య సహకారానికి సంబంధించిన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
02 JUN 2021 12:52PM by PIB Hyderabad
సుస్థిర నగరాభివృద్ధి కోసం భారత ప్రభుత్వ గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా, పర్యటన మంత్రిత్వ శాఖ కు మధ్య సహకారపూర్వక ఒప్పందం (మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేశన్.. ఎమ్ఒసి) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒసి నగరాభివృద్ధి కి సంబంధించి 2007వ సంవత్సరం నాటి అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) స్థానం లో అమలవుతుంది.
అమలు వ్యూహం:
ఈ ఎమ్ఒసి పరిధి లోకి సహకారానికి సంబంధించిన కార్యక్రమాల అమలు కు, తగిన వ్యూహాన్ని రూపొందించడం కోసం ఒక సంయుక్త కార్య దళం (జాయింట్ వర్కింగ్ గ్రూపు.. జెడబ్ల్యుజి) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంయుక్త కార్య దళం సంవత్సరం లో ఒక సారి సమావేశం అవుతుంది; ఈ సమావేశాన్ని ఒక సారి జపాన్ లో, ఆ తరువాత భారతదేశం లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఎమ్ఒసి లో భాగం గా సహకారం ఒప్పంద పత్రాలపై సంతకాలు అయిన రోజు నుంచి మొదలవుతుంది. ఒప్పందం 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 5 సంవత్సరాల కాలం పూర్తి అయిన తరువాత తదుపరి 5 సంవత్సరాల కాలానికి ఒప్పందం తాలూకు నవీనీకరణ దానంతట అదే జరిగిపోతుంది.
ముఖ్య ప్రభావం:
ఈ ఎమ్ఒసి ద్వారా రెండు దేశాల మధ్య సుస్థిర నగరాభివృద్ధి రంగం లో బలమైన, లోతైన దీర్ఘకాలిక ద్వైపాక్షిక సహకారానికి ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రయోజనాలు:
ఈ ఎమ్ఒసి ద్వారా సుస్థిర నగర అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, స్మార్ట్ సిటీస్ తాలూకు అభివృద్ధి, తక్కువ ఖర్చు లో గృహ నిర్మాణం (కిరాయి ఇళ్లు సహా), పట్టణ ప్రాంతాల లో వరద ల సంబంధిత నిర్వహణ, మురుగునీటి మరియు ఘన వ్యర్ధాల తాలూకు నిర్వహణ, పట్టణ రవాణా (ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్, ట్రాన్సిట్- ఓరియంటెడ్ డివెలప్ మెంట్, మల్టిమోడల్ ఇంటిగ్రేశన్ సహా), విపత్తుల ను తట్టుకొని నిలచే అభివృద్ధి వంటి రంగాల లో ఉపాధి అవకాశాలు అందివస్తాయన్న ఆశ లు ఉన్నాయి.
వివరాలు:
సుస్థిర నగరాభివృద్ధి, నగర ప్రణాళిక, స్మార్ట్‌సిటీల అభివృద్ధి, చౌక గృహ నిర్మాణం, (అద్దె ఇళ్లు), నగర వరద నిర్వహణ, మురికినీటిపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ , ట్రాన్సిట్ నిర్దేశిత అభివృద్ధి, మల్టీమోడల్ ఇంటిగ్రేశన్, విపత్తుల ను తట్టుకొనే రీతి లో అభివృద్ధి కోసమే కాక ఇరు పక్షాలు పరస్పరం గుర్తించిన అంశాల లో కూడా భారతదేశం, జపాన్ ల మధ్య సాంకేతిక సహకారాన్ని మరింత బలపరచడం, ఆ తరహా సహకారానికి బాట ను పరచడం అనేవి ఈ ఎమ్ఒసి ఉద్దేశాలు గా ఉన్నాయి. పైన ప్రస్తావించిన రంగాల లో నేర్చుకున్న కీలకమైన పాఠాలను, ఉత్తమ అభ్యాసాల ను ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకొనేందుకు ప్రతిపాదిత ఎమ్ఒసి వీలు ను కల్పిస్తుంది.
***
(Release ID: 1723832)