నీతి ఆయోగ్

జూన్ 3, 2021 న ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్ , డాష్‌బోర్డ్, 2020-21ను ప్రారంభించనున్న నీతీ ఆయోగ్

Posted On: 02 JUN 2021 11:45AM by PIB Hyderabad

సుస్థిర అభివృద్ధి సాధనలో భారతదేశం సాధిస్తున్న లక్ష్యాలను తెలియజేసే సూచిక (ఎస్‌డిజి) మూడవ కూర్పును నీతీ ఆయోగ్ 2021 జూన్ మూడవ తేదీన ప్రారంభించనున్నది. సుస్థిర అభివృద్ధి సాధన దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఏమేరకు విజయవంతం అవుతున్నాయన్న అంశాన్ని ఈ సూచిక ఆధారంగా మదింపు వేయడం జరుగుతోంది. ఈ సూచిక మదింపు తొలిసారిగా 2018 డిసెంబర్ లో జరిగింది. మూడవసారి మదింపు వేయడానికి నీతీ ఆయోగ్ చర్యలను తీసుకుంటున్నది. అభివృద్ధి లక్ష్య సాధనను మదింపు వేస్తూనే లక్ష్య సాధనకు ర్యాంకులను ఇస్తున్న నీతీ ఆయోగ్ దీనిద్వారా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పోటీని ప్రోత్సహిస్తున్నది. నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ 2020-21లో ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్, డాష్‌బోర్డ్‌ను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నీతీ ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్య) . డాక్టర్ వినోద్ పాల్, సంస్థ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్, సంస్థ సలహాదారు (ఎస్‌డిజి),సన్యుక్త సమాదార్ హాజరవుతారు. నీతీ ఆయోగ్ రూపొందించి అభివృద్ధి చేసిన సూచికను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారతదేశంలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, కేంద్ర గణాంక శాఖ ఇతర మంత్రిత్వశాఖలతో చర్చించిన తరువాత సిద్ధం చేస్తారు. 

ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్, & డాష్‌బోర్డ్, 2020-21:రూపకల్పనలో భాగస్వామ్యులు:

ప్రపంచ  లక్ష్యాలను చేరుకోవడానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలలో జరుగుతున్న ప్రయత్నాలను మదింపు వేయడానికి ఐక్యరాజ్యసమితి సహకారంతో  

 భారతదేశంలో సూచికలకు రూపకల్పన జరుగుతుంది. స్థిరమైన సుస్థిర అభివృద్ధి సాధన కోసం ఈ మదింపు ఉపయోగపడుతుంది. 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి మూడింట ఒక వంతు మిగిలి ఉండడంతో ఈ సారి సంయుక్త కృషికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మదింపు సూచికలను  ఎస్‌డిజి    ఇండియా ఇండెక్స్ డాష్‌బోర్డ్, 2020-21: పార్టనర్ షిప్స్ ఇన్ ది డికేడ్ ఆఫ్ యాక్షన్ ” పేరిట నిర్వహించనున్నారు. 

మదింపును మరింత పటిష్టంగా సమర్ధంగా నిర్వహించడానికి ప్రగతి సాధన, పురోగతి తదితర అంశాల్లో మార్పులు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2018-19లో జరిగిన మదింపులో 13 లక్ష్యాలు 39 లక్ష్యాల సాధన, 62 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. రెండవ మధింపులో 17 లక్ష్యాలు 54 లక్ష్యాల సాధన, 100 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. మూడవ మదింపు 17 లక్ష్యాలు 70 లక్ష్యాల సాధన, 115 సూచికల ఆధారంగా జరగనున్నది. 

మదింపు విధానం, ప్రక్రియ:

రాష్ట్రాలు మరియు యుటిల పనితీరును మదింపు వేసి వారికి ర్యాంకింగ్ ఇవ్వడం, ప్రాధాన్యతా అంశాలపై దృష్టి సారించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సహకారం అందించి వాటి మధ్య ఆయోగ్యకర పోటీ జరిగేలా చూడాలన్న లక్ష్యాలతో మదింపు కార్యక్రమం జరుగుతుంది. మొదటి 16 లక్యాలను సంబందించిన సమాచారాం 17వ లక్ష్య సాధనకు సంబందించిన గుణాత్మక అంచనాతో మదింపు జరుగుతుంది. లక్ష్యాలను నిర్దేశించడం, ప్రగతి కొలమానం మదింపు వేయడానికి సాంకేతిక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల ఆధారంగా సాగుతుంది. ప్రతి సూచికకు  లక్ష్యం ఏమేరకు నెరవేరింది అన్న అంశాన్ని మదింపు వేయడానికి ప్రతి సూచికలో మదింపు వేయడం జరుగుతుంది. లక్ష్యాల వారీగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన ప్రగతిని మదింపు వేయడానికి ప్రతికూల, సానుకూల సూచికలు ఉంటాయి. 2030 ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు సాధించే ప్రతి లక్ష్య సాధనకు మార్కులు వేస్తారు. 

సూచికల ఎంపికకు ముందు కేంద్ర గణాంక శాఖ,ఇతర  కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు సంబంధిత వర్గాలతో   సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుంది.  అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు  సూచికల ముసాయిదా జాబితాతో పాటు  ఎంపిక ప్రక్రియ తెలియజేయబడుతుంది.  సూచికలకు తుది రూపు ఇచ్చే అంశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యమైన పాత్రను నిర్వహించవలసి ఉంటుంది. 

జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా 2030 ప్రణాళిక కింద సాధించవలసిన లక్ష్యాలను ఈ సూచికలు ప్రతిభింబిస్తాయి.  ఆరోగ్యం, విద్య, లింగం, ఆర్థిక వృద్ధి, సంస్థలు, వాతావరణ మార్పు మరియు పర్యావరణ అంశాలలో  రాష్ట్రాలు మరియు యుటిలు సాధించిన  పురోగతిని అంచనా వేయడానికి ఈ సూచికలు ఉపయోగపడతాయి.  రాష్ట్రాలకు 15వ ఆర్ధిక సంఘం అందించే నిధులను నిర్ణయించడంతో పాటు, రాష్ట్రాలు, జిల్లాల వారీగా ప్రగతి సూచికలను రూపొందించుకుని లక్ష్యాలను సాధించడానికి ఈ మదింపు సహకరిస్తుంది. 

జాతీయ మరియురాష్ట్ర  స్థాయిలో ఎస్‌డిజిల స్వీకరణ మరియు పర్యవేక్షణను సమన్వయం చేసే అధికారం నీతీ  ఆయోగ్‌కు ఉంది.  రాష్ట్రాలు మరియు యుటిలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడం  పురోగతి పర్యవేక్షణను మెరుగుపర్చడానికి నిరంతరం కృషి చేయడంలో నీతీ  ఆయోగ్ చేస్తున్న  ప్రయత్నాలను  ఎస్‌డిజి సూచిస్తుంది.

***



(Release ID: 1723827) Visitor Counter : 337