రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో 500 పడకల కోవిడ్ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన డిఆర్డిఓ

Posted On: 02 JUN 2021 1:18PM by PIB Hyderabad

హల్ద్వానీలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) ఏర్పాటు చేసిన 500 పడకల కోవిడ్ కేర్ ఆస్పత్రిని 2021 జూన్ 02 న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ తీరత్ సింగ్ రావత్ ప్రారంభించారు. ఈ సదుపాయంలో 375 ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లతో 125 ఐసియు పడకలు ఉన్నాయి. . 100 శాతం పవర్ బ్యాకప్‌తో, ఇది అన్ని వాతావరణ పరిస్థితులకు కేంద్రంగా ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేసారు. పాథాలజీ ప్రయోగశాల, ఫార్మసీ, ఎక్స్-రే, ఇసిజి మొదలైనవి ఈ సదుపాయంలో అంతర్లీనంగా ఉన్నాయి. ఈ కేంద్రం 2021 జూన్ 03 నుండి పూర్తిగా పనిచేయనుంది.

ఆధునిక సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా సరైన పర్యవేక్షణ మరియు ఆసుపత్రి నిర్వహణ కోసం వై-ఫై, సిసిటివిలు మరియు హెల్ప్‌లైన్ నంబర్‌తో కూడిన నియంత్రణ కేంద్రం కూడా దీనిలో ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని నడపడానికి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హల్ద్వానీలోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి ఇక్కడ నియమించారు. 
21 రోజుల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో నిర్విరామంగా పనిచేసిన 350 మంది ఉద్యోగుల కృషి ఉంది. దేశవ్యాప్తంగా లొక్డౌన్ ఉన్నప్పటికీ నిర్దిష్ట కాలంలో పూర్తీ చేయాలనే లక్ష్యాన్ని ఒక సవాలుగా తీసుకుని ఈ ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్, ఫైర్ హైడ్రాంట్లు మరియు అగ్నిమాపక పరికరాల ఏర్పాటు వంటి తప్పనిసరి అగ్ని భద్రతా నిబంధనలు పాటించారు. 

ప్రస్తుత కోవిడ్ పరిస్థితిలో, ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఉత్తరాఖండ్ ప్రజలకు చాల అమూల్యమైనది. ఇది మహమ్మారి సమయంలో సకాలంలో అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన, భారత సైన్యం 17 వ చీఫ్ అయిన దివంగత జనరల్ బిపిన్ చంద్ర జోషి పేరు మీద ఇది అంకితం చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అజయ్ భట్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రి శ్రీ బన్సిధర్ భగత్, ప్రతిపక్ష నేత డాక్టర్ ఇందిరా హృదయేష్, డిఆర్డిఓ & రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మహమ్మారి సమయంలో నిరంతర సహాయం చేస్తున్న  డిఆర్‌డిఓని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డి కార్యదర్శి, డిఆర్‌డిఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఈ పనిలో పాల్గొన్న బృందం చేసిన కృషిని ప్రశంసించారు. ఇందుకు సహకరించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 

 

***


(Release ID: 1723825) Visitor Counter : 243