గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సుస్థిర నగరాభివృద్ధి రంగం లో భారతదేశం, మాల్దీవుల మధ్య సహకారం అంశం పై అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
02 JUN 2021 12:57PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు, మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన జాతీయ ప్రణాళిక, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ కు మధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందాన్ని (ఎమ్ఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడం జరిగింది. ఈ ఎమ్ఒయు సుస్థిర నగరాభివృద్ధి రంగం లో పరస్పర సహకారానికి సంబంధించినది. ఈ ఎమ్ఒయు పై 2021 ఫిబ్రవరి లో సంతకాలు అయ్యాయి.
ఈ సహకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు , ఇందుకు సంబంధించిన వ్యూహాన్నిరూపొందించేందుకు ఒక సంయుక్త వర్కింగ్ గ్రూప్ (జెడబ్ల్యుజి)ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంయుక్త వర్కింగ్ గ్రూప్ సమావేశం సంవత్సరం లో ఒక సారి సమావేశమౌతుంది. ఒకసారి మాల్దీవుల లోను, మరో సారి భారతదేశం లోను జెడబ్ల్యుజి సమావేశమౌతుంది.
ప్రయోజనాలు:
ఈ అవగాహన ఒప్పందం భారతదేశం, మాల్దీవుల మధ్య సుస్థిర నగర అభివృద్ధి విషయం లో బలమైన, లోతైన , దీర్ఘకాలిక ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా సుస్థిర నగరాభివృద్ధి, నగర ప్రణాళిక, స్మార్ట్ సిటీస్ అభివృద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణ, చవక ధర లో గృహాల అందుబాటు, అర్బన్ గ్రీన్ మొబిలిటి, అర్బన్ మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు లతో పాటు స్థిర నగరాభివృద్ధి రంగం లో ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయన్న ఆశ లు ఉన్నాయి.
వివరాలు:
ఈ అవగాహన ఒప్పందం ఉభయ దేశాలు ఒప్పంద పత్రం పైన సంతకాలు చేసిన తేదీ నాటి నుంచి, అంటే 2021 ఫిబ్రవరి 20 నాటి నుంచి, అమలు లోకి వచ్చింది. ఇది నిరవధికం గా అమలు అవుతుంది.
సుస్థిర నగరాభివృద్ధి, నగర ప్రణాళిక, స్మార్ట్ సిటీస్ అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ఖర్చు లో గృహ నిర్మాణం, అర్బన్ గ్రీన్ మొబిలిటి, అర్బన్ మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు, స్మార్ట్ సిటీస్ అభివృద్ధి లలో భారతదేశం-మాల్దీవుల మధ్య సాంకేతిక సహకారాన్ని బలపర్చడం, ఆ విధమైన సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం తో పాటు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినటువంటి ఏదైనా ఇతర సంబంధిత రంగం లో కూడాను సహకారాన్ని బలోపేతం చేయడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యాల లో ముఖ్యమైనవి.
***
(Release ID: 1723823)
Visitor Counter : 178