మంత్రిమండలి

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా అమలు లోకి తీసుకురావడం కోసం మాడల్ టెనెన్సీ యాక్టు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 02 JUN 2021 12:49PM by PIB Hyderabad

ఇంటి ని కిరాయి కి ఇవ్వడానికి గాని, లేదా ఇంటి ని కిరాయికి తీసుకోవడానికి గాని సంబంధించిన మాడల్ టెనెన్సీ యాక్టు ను జారీ చేయడాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  దీని ని అన్ని రాష్ట్రాల కోసం, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల కోసం జారీ చేయడం జరుగుతోంది; దీనితో అవి ఇప్పటికే అమలు లో ఉన్నటువంటి అద్దె సంబంధి చట్టాల లో తమ లెక్క ప్రకారం తాజా శాసనాన్ని చేయడం గానిమో, లేదా ప్రస్తుత చట్టాల లో సవరణ కు గాని వీలు ఏర్పడుతుంది.  

దీని ద్వారా దేశ వ్యాప్తం గా ఇళ్ల ను అద్దె కు ఇచ్చే విషయం లో చట్ట రూపాన్ని పక్కా గా రూపొందించడం లో తోడ్పాటు లభిస్తుంది; అదే జరిగితే సమగ్ర వృద్ధి కి మార్గం సుగమం అవుతుంది.


దేశం లో ఇల్లు- కిరాయిదారు ల పరంగా ఓ హుషారైనటువంటి, నిలకడతనం కలిగివుండేటటువంటి, అన్ని వర్గాల ను కలుపుకు పోయేటటువంటి కిరాయి ఇళ్ల నిర్మాణ విపణి ని సృజించడం అనేది మాడల్ టెనెన్సీ యాక్టు ఉద్దేశం గా ఉంది.  దీని తో అన్ని ఆదాయ సమూహాల వారి కోసం అద్దె ఇళ్లు అందుబాటు లోకి రాగలవు; నిరాశ్రయులయ్యే సమస్య కు సమాధానం దొరుకుతుంది.  మాడల్ టెనెన్సీ యాక్టు ద్వారా ఇంటి ని బాడుగ కు ఇచ్చే ప్రక్రియ మెల్ల మెల్లగా లాంఛన ప్రాయమైన విపణి లా మార్చి దానికి సంస్థాగత రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది.

మాడల్ టెనెన్సీ యాక్టు తో ఖాళీ గా మిగిలివున్నటువంటి ఇళ్ల ను అద్దె కు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది.  దీని ద్వారా అద్దె ఇళ్ల బజారు ను వ్యాపారం రూపం లో అభివృద్ధి పర్చడం లో ప్రయివేటు భాగస్వామ్యం పెరుగుతుందని, భారీ గా ఉన్నటువంటి ఇళ్ల కొరత సమస్య ను పరిష్కరించవచ్చన్న ఆశ లు రేకెత్తుతున్నాయి.  
 


 

***



(Release ID: 1723743) Visitor Counter : 206