కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పాలిచ్చే తల్లులు ఇంటి నుండి పని చేయడాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను / కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిన కేంద్రం

Posted On: 01 JUN 2021 7:40PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి సమయంలో మహిళా ఉద్యోగులు.. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా, వాళ్లు ఇంటి నుండి పని చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది. ప్రసూతి ప్రయోజనం (సవరణ) చట్టం, 2017 లోని సెక్షన్ 5 (5) ప్రకారం పాలిచ్చే తల్లులకు ఇలాంటి వెసులుబాట్లను కల్పించవచ్చు. ఒక మహిళకు కేటాయించిన పని స్వభావం  ఆమె ఇంటి నుండి పని చేయగలిగినది అయి ఉండే ప్రసూతి ప్రయోజనాన్ని పొందిన తరువాత ,  యజమాని ఆమెకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించవచ్చు. ఇరువర్గాల సమ్మతితోనే నిర్ణయం తీసుకోవాలి. కోవిడ్ మహమ్మారి సమయంలో పాలిచ్చే తల్లులు , వారి బిడ్డల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వైరస్ బారిన పడకుండా వారిని కాపాడటానికి, కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహాలు ఇచ్చింది. పని  స్వభావం వర్క్ ఫ్రం హోం విధానానాకి అనువుగా ఉంటే పాలిచ్చే తల్లులకు ఆ సదుపాయం కల్పించాలని సూచించింది. మహిళా శ్రామికశక్తికి, యజమానులకు ప్రసూతి ప్రయోజనం చట్టం  సెక్షన్ 5 (5) గురించి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను అభ్యర్థించింది. పని  స్వభావం అనుమతించే చోట చట్టం  సెక్షన్ 5 (5) ప్రకారం ఎక్కువ మంది పాలిచ్చే తల్లులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం కోసం యజమానులకు సలహాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పిల్లల పుట్టిన తేదీ నుండి కనీసం ఒక సంవత్సరం వరకు పాలిచ్చే తల్లులకు, వీలైతే  ఇంటి నుండి పనిని అనుమతించాల్సిందిగా యజమానులకు సూచించవచ్చని తెలియజేయబడింది.   కోవిడ్ సమయంలో పాలిచ్చే తల్లులను రక్షించడంతో పాటు, పని  స్వభావం అనుమతించే చోట ఇంటి నుండి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తే వాళ్లు ఉపాధికి దూరం కారు. దీనివల్ల శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వీలవుతుంది. ఫలితంగా కార్మికశక్తి సంతోషంగా ఉంటుంది.

***



(Release ID: 1723600) Visitor Counter : 212