ప్రధాన మంత్రి కార్యాలయం

సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు


12వ తరగతి ఫలితాల ను సమయబద్ధ పద్ధతి లో చక్కని స్పష్టమైన ఉద్దేశ్యాలతో కూడినటువంటి ప్రమాణాల ను అనుసరించి రూపొందించడం జరుగుతుంది

సిబిఎస్‌ఇ 12 వ తరగతి  పరీక్షలపై నిర్ణయాన్ని విద్యార్థుల మేలు ను కోరి తీసుకోవడం జరిగింది: ప్రధాన మంత్రి


మన విద్యార్థుల ఆరోగ్యం, వారి క్షేమం అత్యంత ముఖ్యమైన అంశాలు, ఈ విషయం మీద ఎలాంటి రాజీ ఉండబోదు: ప్రధాన మంత్రి

విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల లో వ్యాకులత కు తప్పక స్వస్తి చెప్పి తీరాలి: ప్రధాన మంత్రి

ఆ తరహా ఒత్తిడి తో కూడిన స్థితి లో విద్యార్థులను పరీక్షల కు హాజరు కావలసిందిగా బాధ్యులను చేయకూడదు: ప్రధాన మంత్రి

ఈ అంశం లో భాగస్వాములందరూ విద్యార్థుల పట్ల సున్నితం గా వ్యవహరించవలలసిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 01 JUN 2021 7:27PM by PIB Hyderabad

సిబిఎస్‌ఇ 12వ తరగతి కి సంబంధించిన బోర్డు పరీక్షల పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.  ఈ క్రమం లో అధికారులు ఇప్పటి వరకు విస్తృతంగా సాగిన సంప్రదింపుల తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సహా భాగస్వామ్య పక్షాల వద్ద నుంచి వ్యక్తమైన అభిప్రాయాల పై సమగ్ర సమర్పణ ను అందజేశారు. 

కోవిడ్ కారణం గా తలెత్తిన అనిశ్చిత పరిస్థితులు, విభిన్న భాగస్వామ్య పక్షాల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనల ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డు పరీక్షల ను  నిర్వహించబోవడం లేదన్న నిర్ణయాన్ని తీసుకోవడమైంది.  సిబిఎస్‌ఇ 12వ తరగతి విద్యార్థుల ఫలితాల ను సమయబద్ధ పద్ధతి లో చక్కని స్పష్టమైన ఉద్దేశ్యాలతో కూడినటువంటి ప్రమాణాల ను అనుసరించి రూపొందించడానికి అవసరమైన చర్యల కు నడుం కడుతుందనే నిర్ణయాన్ని కూడా తీసుకొన్నారు.

సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల పై నిర్ణయాన్ని విద్యార్థుల మేలు కోరి తీసుకోవడమైందని ప్రధాన మంత్రి అన్నారు.  కోవిడ్-19 విద్యా ప్రణాళిక ను ఎంతగానో ప్రభావితం చేసిందని, బోర్డు పరీక్షల అంశం విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులలో అత్యధిక ఆందోళన ను కలిగిస్తోందని, దీనిని  తప్పక సమాప్తం చేయవలసి ఉందని ఆయన అన్నారు.

దేశం అంతటా కోవిడ్ తో ముడిపడ్డ స్థితి ఎప్పటికప్పుడు మారిపోతోందని ప్రధాన మంత్రి అన్నారు.  కోవిడ్ కేసు లు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు ప్రభావశీల మైక్రో-కంటేన్ మెంట్  మాధ్యమం ద్వారా మహమ్మారి ని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి, మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ లాక్ డౌన్ వైపు మొగ్గు చూపాయి.  అటువంటి స్థితి లో విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సహజంగానే ఆందోళన చెందుతున్నారు.  ఇలాంటి ఒత్తిడి తో కూడిన స్థితి లో విద్యార్థులను పరీక్షల కు హాజరు కండి అంటూ బాధ్యులను చేయకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు.

మన విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రత కు అత్యధిక ప్రాముఖ్యం ఉంది, ఈ అంశం పై ఎలాంటి రాజీ ఉండదు అంటూ ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.  నేటి కాలం లో, ఇలాంటి పరీక్ష లు మన యువత ను ప్రమాదం లో పడవేసేందుకు కారణం కారాదని ఆయన అన్నారు.

ఈ అంశంలో భాగస్వామ్యం కల వారందరూ విద్యార్థుల పట్ల సున్నితత్వాన్ని కనబరచవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  ఫలితాలను పూర్తి గా స్పష్టమైన ప్రమాణాలకు అనుగుణంగా నిష్పక్షమైన, సమయబద్ధమైన పద్ధతి లో రూపొందించవలసిందంటూ ప్రధాన మంత్రి అధికారుల ను ఆదేశించారు.

విస్తృత స్థాయి సంప్రదింపుల ప్రక్రియ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం లో మూల మూలన ఉన్న భాగస్వామ్య పక్షాల తో సంప్రదించిన తరువాతనే విద్యార్థులకు మేలు చేసేదిగా ఉండేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు.  ఈ అంశం పై అభిప్రాయాలను, సూచనల ను ఇచ్చినందుకు గాను రాష్ట్రాల కు ఆయన ధన్యావాదాలు తెలిపారు.

గత సంవత్సరం మాదిరిగానే కొంతమంది విద్యార్థులు పరీక్ష లు రాయాలి అని అనుకుంటే స్థితి అనుకూలం గా మారితే గనక సిబిఎస్‌ఇ ద్వారా వారికి ఆ ఐచ్ఛికాన్ని అందించడం జరుగుతుందనేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకొన్నారు.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఇంతకు ముందు 2021 మే 21న ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.  ఆ సమావేశం లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.  ఆ తరువాత 2021మే 23న కేంద్ర రక్షణ మంత్రి అధ్యక్షత న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి రాష్ట్రాల విద్య శాఖ మంత్రులు హాజరయ్యారు.  సిబిఎస్‌ఇ పరీక్షల నిర్వహణ కు వివిధ ఐచ్ఛికాల పై సమావేశం లో చర్చించడం జరిగింది.  రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాలు, సూచన లు అందాయి.

నేటి సమావేశానికి కేంద్ర హోమ్ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, సమాచార- ప్రసార శాఖ, పెట్రోలియమ్ శాఖ, మహిళలు, బాల వికాస శాఖ ల మంత్రులు, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, పాఠశాల విద్య & ఉన్నత విద్య విభాగాల కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు.


 
 

*****(Release ID: 1723550) Visitor Counter : 298