రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

చీఫ్ ఆఫ్ మెటీరియ‌ల్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైస్ అడ్మిర‌ల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎం

Posted On: 01 JUN 2021 11:27AM by PIB Hyderabad

 భార‌తీయ నావ‌వికాద‌ళ చీఫ్ ఆప్ మెటీరియ‌ల్గా 01 జూన్ 2021న వైస్ అడ్మిర‌ల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా ఛార్జి తీసుకున్నారు. 
పూణె ఖ‌డ‌క‌వ‌స్లాలోని నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీకి చెందిన గ్రాడ్యుయేట్ అయిన ఆయ‌న‌ను 01 జ‌న‌వ‌రి 1985న భార‌తీయ నావికాద‌ళ ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌లో నియ‌మించారు. ఐఐటి ఢిల్లీ నుంచి రాడార్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప‌ట్టాను పొందిన అడ్మిర‌ల్ డిఫెన్స్ స‌ర్వీసెస్‌ స్టాఫ్ కాలేజీ (డిఎస్ఎస్‌సి), నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్‌డిసి)కి చెందిన ప్ర‌ముఖ పూర్వ విద్యార్ధి కూడా. 
నావికాద‌ళంలో త‌న మూడున్న‌ర ద‌శాబ్దాల దేదీప్య‌మాన‌మైన త‌న కెరీర్‌లో అడ్మిర‌ల్ ప‌లు స‌వాళ్ళ‌తో కూడిన ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు ఆయ‌న ఎయిర్ క్రాఫ్ట్ కారియ‌ర్ విరాట్‌లో వివిధ స్థాయిల్లో సేవ‌ల‌ను అందించారు. అలాగే, ముంబై, విశాఖ‌ప‌ట్నం నావ‌ల్ డాక్ యార్డుల‌లో, నావికాద‌ళ కేంద్ర కార్యాల‌యంలో ఉద్యోగులు, సిబ్బంది, మెటీరియ‌ల్ శాఖ‌ల‌లో కీల‌క ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. నావికాద‌ళానికి చెందిన ప్ర‌తిష్ఠాత్మ‌క ఎల‌క్ట్రిక‌ల్ ట్రైనింగ్ సంస్థ ఐఎన్ఎస్ వ‌ల్సురాను అడ్మిర‌ల్ నిర్వ‌హించారు.
ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా ఆయ‌న నావికాద‌ళ కేంద్ర‌కార్యాల‌యంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ మెటీరియ‌ల్ (ఆధునీక‌ర‌ణ‌), చీఫ్ స్టాఫ్ ఆఫీస‌ర్ (టెక్నీక‌ల్‌) కేంద్ర‌కార్యాల‌యం డ‌బ్ల్యుఎన్‌సి, ముంబై నావ‌ల్ డాక్ యార్డు అడ్మిర‌ల్ సూప‌రింటెండెంట్‌గా, ముంబైలో నావికాద‌ళ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా, ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ కేంద్ర‌కార్యాల‌యం ఎటివిపి, నావికాద‌ళ కేంద్ర‌కార్యాల‌యంలో యుద్ధ నౌక‌ల ఉత్ప‌త్తి, స్వాధీనం కంట్రోల‌ర్ గా అడ్మిర‌ల్ సేవ‌లు అందించారు. 
ఆయ‌న విశిష్ట సేవ‌ల‌కు గుర్తింపుగా అడ్మిర‌ల్‌కు అతి విశిష్ట సేవా మెడ‌ల్‌ను, విశిష్ట సేవా మెడ‌ల్‌ను అందించారు. 
భార‌తీయ నావికాద‌ళంలో ప్ర‌ధాన స్టాఫ్ ఆఫీస‌ర్‌, అత్యంత సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌గా నౌక‌లు, స‌బ్ మెరైన్ల అన్ని ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఆయుధాలు, సెన్సార్ల‌, ఐటి సంబంధిత ప‌రిక‌రాలు, వ్య‌వ‌స్థ‌లు  నిర్వ‌హ‌ణ‌, ఉత్ప‌త్తి జీవిత కాల మ‌ద్ద‌తు, నావికాద‌ళ ప‌రికరాల స్వ‌దేశీక‌ర‌ణ‌, ప్ర‌దాన నావికాద‌ళ‌, సాంకేతిక మౌలిక‌స‌దుపాయాల‌కు అడ్మిర‌ల్ ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హరిస్తారు.
వ‌యోప‌రిమితి పూర్తి కావ‌డంతో 31 మే 2021న సూప‌ర్ ఆన్యుయేట్ అయిన వైస్ అడ్మిర‌ల్ ఎస్ ఆర్ శ‌ర్మ‌, పివిఎస్ఎం, ఎవిఎస్ఎం, విఎస్ఎం స్థానాన్ని అడ్మిర‌ల్ భ‌ర్తీ చేశారు.  

 

***

 


(Release ID: 1723443) Visitor Counter : 269