శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎయిర్ ప్యూరిఫైయర్ల తయారీకి అమెరికాకు చెందిన మోలేకులే సంస్థతో కలసి పనిచేయనున్న పంజాబ్ విశ్వవిద్యాలయం
ఎయిర్ ప్యూరిఫైయర్లను భారతదేశంలో ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్న మోలేకులే, పంజాబ్ విశ్వవిద్యాలయం
Posted On:
31 MAY 2021 4:06PM by PIB Hyderabad
పంజాబ్ విశ్వవిద్యాలయం తీసుకున్న చొరవతో చండీఘర్, పంజాబ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ఆసుపత్రుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటుకానున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను తయారు చేయడానికి అమెరికాకు చెందిన మోలేకులేతో పంజాబ్ విశ్వవిద్యాలయంలో డిఎస్టీ ఆమోదం పొందిన అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ అవగాహన కుదుర్చుకుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ల వల్ల కోవిడ్ వార్డులు, ఐసీయూలలో వెంటిలేషన్ సౌకర్యాలు మెరుగుపడతాయి.ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉత్పత్తి రంగంలో మోలేకులే ఉంది. ఈ సంస్థ కోసం విడిభాగాలను బిగించి ఎయిర్ ప్యూరిఫైయర్లను దేశంలో సిద్ధం చేయడానికి పంజాబ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తొలుత పది ఆసుపత్రుల్లో వీటిని నెలకొల్పుతారు. ఆ తరువాత వీటి సంఖ్యని పెంచడం జరుగుతుంది.
ఈ భాగస్వామ్యం వల్ల దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు మోలేకులే ఎయిర్ ప్యూరిఫైయర్లను, ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ యూనిట్లను విరాళంగా అందించింది. ఇంతవరకు ఆరు రాష్ట్రాలకు ఈ సహాయం అందింది. కోవిడ్ సమస్యను ఎదుర్కొంటున్న అన్ని రాష్ట్రాలకు ఎయిర్ ప్యూరిఫైయర్లను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రుల్లో రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందికి స్వచ్ఛమైన గాలి ధారాళంగా అందుతుంది.
ఎయిర్ ప్యూరిఫైయర్లు ఆసుపత్రుల లోపల వీచే గాలిని శుద్ధి చేసి వెంటిలేషన్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనితో గాలి ద్వారా కోవిడ్ 19 వైరస్ క్రిములు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండదు. దీనితో కోవిడ్-19 రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించి, స్వచ్ఛమైన వాతావరణంలో పనిచేయడానికి ఆరోగ్య సిబ్బందికి అవకాశం కల్పించడానికి వీలవుతుంది.
వైరస్, బాక్టీరియా, బూజు, ఇతర రసాయనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా చూడడానికి మోలేకులే అభివృద్ధి చేసిన పెట్రో కెమికల్ ఆక్సిడేషన్ సాంకేతికతో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల కరోనా వైరస్ క్రిములు, హెచ్ 1ఎన్ 1 క్రిములు గాలి ద్వారా వ్యాపించే వైరస్, బూజు, బాక్టీరియా 99.99% వరకు నిర్వీర్యం అవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది.
మోలేకులే నుంచి తొలిసారిగా అందిన ఎయిర్ ప్యూరిఫైయర్ మినీ, మోలేకులే ఎయిర్ ప్రో ఆర్‌ఎక్స్ యూనిట్లు పంజాబ్ విశ్వవిద్యాలయంకి చేరాయి. వీటిని విశ్వవిద్యాలయ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ సెంటర్ లో బిగించి పరీక్షించారు. అత్యవసర విభాగాలు, ఐసీయూ లు లాంటి ప్రాంతాల్లో ఉపయోగించడానికి అమెరికా పరిస్థితులకు అనుగుణంగా మోలేకులే పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు మరింత సమర్ధంగా అమలు జరగడానికి అవకాశం కలుగుతుంది.
పంజాబ్ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో డీఎస్టీ సహకారంతో పని చేస్తున్న సాంకేతిక కేంద్రాల సహకారంతో కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉందని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్. అశుతోష్ మిశ్రా అన్నారు. మానవ మేధస్సుకు అధునాతన పరికరాలు, వ్యవస్థలు తోడైతే ఏ సమస్యను అయినా ఎదుర్కోవడానికి వీలవుతుంది అని ఆయన అన్నారు.
ఆసుపత్రులకు యూనిట్లను పంపిణీ చేయడానికి ముందు ఇవి పనిచేసే విధానాన్ని, వీటివల్ల కలిగే ప్రయోజనాలను వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లు / చీఫ్ మెడికల్ ఆఫీసర్, / మెడికల్ సూపరింటెండెంట్లకు వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యవసర వార్డులు, ఐసియులు, కోవిడ్ వార్డులు మరియు వెయిటింగ్ రూమ్‌లలో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లను నెలకొల్పారు.
ఎయిర్ ప్యూరిఫైయర్ల వివరాలు:
1. పంజాబ్ విశ్వవిద్యాలయం కోవిడ్ కేర్ సెంటర్ (100 పడకల సామర్థ్యం), ఆరోగ్య కేంద్రం మరియు పంజాబ్ విశ్వవిద్యాలయం డాక్టర్ హర్వంష్ సింగ్ జడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ హాస్పిటల్ కు 42 యూనిట్లు పంపిణీ చేయబడ్డాయి.
2. షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ లో నెలకొల్పడానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి 40 యూనిట్లను అందించారు.
3. మోలేకులే ఎయిర్ ప్రో ఆర్‌ఎక్స్ యూనిట్ తో సహా 60 యూనిట్లను చండీఘర్ పీజిమ్మర్ డైరెక్టర్ కు అందించారు.
4. చండీఘర్ సెక్టార్ 16లో పనిచేస్తున్న గవర్నమెంట్ మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ అమన్దీప్ కాంగ్ 30 యూనిట్లను స్వీకరించారు.
5. చండీఘర్ సెక్టార్ 30లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాస్బిన్దర్ కౌర్ 20 యూనిట్లను స్వీకరించారు.
6. బతిండా ఎయిమ్స్ కు పంజాబ్ విశ్వవిద్యాలయం 20 మోలేకులే ఎయిర్ ప్యూరిఫైయర్లను అందించింది.
***
(Release ID: 1723196)
Visitor Counter : 153